ప్యాకప్‌ చెప్పేసిన నాగార్జున

ప్యాకప్‌ చెప్పేసిన నాగార్జున

మన్మథుడు 2 గొప్పతనం కాస్త ఆలస్యంగా గ్రహిస్తారని, తన కెరియర్లోని కొన్ని చిత్రాల మాదిరిగా ఆలస్యంగా మన్మథుడు 2 కూడా పుంజుకుంటుందని నాగార్జున మాట్లాడాడు. నెమ్మదిగా పుంజుకుంటుందనే ఆశ వుండొచ్చు కానీ ఇప్పుడు అలాంటి రోజులు లేవు. ఇప్పుడంతా వైరల్‌ మార్కెటింగ్‌తో తొలి వారాంతంలోనే సినిమా రంగు తేలిపోతోంది.

అయితే రెండవ రోజున బింకం ప్రదర్శించాలి కనుక నాగార్జున మీడియా ముందుకొచ్చి మాట్లాడాడు. అయితే ఈ చిత్ర ఫలితం ఏమిటనేది ఆయనకి బాగా తెలుసు. అందుకే బిగ్‌బాస్‌ షోలో కూడా మాట వరసకి అయినా తన సినిమా బ్రహ్మాండంగా ఆడుతోందని నాగార్జున చెప్పుకోలేదు. వెన్నెల కిషోర్‌ని పిలిచినా కానీ ఎక్కడా మన్మథుడు పర్‌ఫార్మెన్స్‌ ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డాడు.

ఇదిలావుంటే సోమవారం మరో ప్రెస్‌మీట్‌ పెట్టాలని సహ నిర్మాతలు, పీఆర్‌ టీమ్‌ నాగార్జునని కోరారు. కానీ సినిమా ఫలితం ఏమిటనేది నాగార్జునకి స్పష్టం కావడంతో ఇక ప్రమోషన్‌ యాక్టివిటీస్‌ ఏమీ వద్దని, సినిమా రిజెక్ట్‌ అయిపోయిందని చెప్పి మన్మథుడు 2కి ప్యాకప్‌ చెప్పేసాడు. ఈ చిత్రం విషయంలో నాగార్జున తనని తాను బ్లేమ్‌ చేసుకోవడం తప్ప మరెవరినీ తప్పు పట్టడానికి లేదు. ఈ వయసులో తనకిది సూట్‌ అవుతుందని, అలాగే ఈ ట్రెండ్‌కి సరిగ్గా సరిపోతుందని నాగార్జునే ఈ చిత్రానికి కర్త, కర్మ, క్రియ అయ్యాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English