చిరంజీవి 'బాహుబలి' కావడం కష్టం!

చిరంజీవి 'బాహుబలి' కావడం కష్టం!

'సైరా'తో బాహుబలి ఈ తరహా బిజినెస్‌ని నిర్మాత రామ్‌ చరణ్‌ ఆశిస్తున్నాడు. చిరంజీవి ఫ్యాక్టర్‌ వల్ల ఈ చిత్రానికి రమారమి వంద కోట్ల బిజినెస్‌ తెలుగు రాష్ట్రాల నుంచి ఆశించవచ్చు కానీ బాహుబలి 2ని తలదన్నే రేట్లు అయితే ఖచ్చితంగా రావు. మిగతా చోట్ల ఎలా వున్నా కానీ నైజాంలో అయితే 'సైరా'కి నలభై కోట్లు పలికే అవకాశం లేదు. పెరిగిన మల్టీప్లెక్సులు, టికెట్‌ ధరల నేపథ్యంలో ముప్పయ్‌ కోట్ల వరకు సైరా నైజాం హక్కులకి లభించవచ్చు.

చిరంజీవి గత చిత్రం 'ఖైదీ నంబర్‌ 150' మిగతా చోట్ల రికార్డు వసూళ్లు సాధించినా కానీ నైజాంలో మాత్రం చతికిలపడింది. నైజాంలో ఇరవై కోట్ల మార్కుని కూడా చేరుకోలేకపోయింది. అది దృష్టిలో వుంచుకుని సైరాకి నైజాంలో ముప్పయ్‌ కోట్ల లోపే ఆఫర్స్‌ వచ్చే అవకాశముంది. అలాగే సీడెడ్‌లో కూడా పాతిక కోట్ల స్థాయిలో ఆఫర్స్‌ రాకపోవచ్చునని ట్రేడ్‌ అంటోంది.

సాహో రిలీజ్‌ అయిన తర్వాత బయ్యర్లకి ఈ స్కేల్‌ సినిమాలపై ఎంత వెచ్చించవచ్చుననే దానిపై స్పష్టమైన అవగాహన వస్తుందని, అంచేత సాహో రిలీజ్‌ వరకు సైరా డీల్స్‌ క్లోజ్‌ చేయకపోతే ఉత్తమమని అంటున్నారు. అదే సమయంలో అలా వేచి చూడడం వల్ల రివర్స్‌ అయ్యే అవకాశమూ లేకపోలేదు. సాహో అంచనాలని అందుకోని పక్షంలో సైరాపై భారీ బెట్టింగ్‌ జరగదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English