సాహో బ‌డ్జెట్.. ఈ ఫిగ‌ర్‌కి ఫిక్స‌వ్వ‌చ్చా?

సాహో బ‌డ్జెట్.. ఈ ఫిగ‌ర్‌కి ఫిక్స‌వ్వ‌చ్చా?

సాహో సినిమా బ‌డ్జెట్ ఎంత అనే విష‌యంలో ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు న‌డిచాయి. ఇది బాహుబ‌లి విడుద‌ల కంటే ముందు ఓకే అయిన సినిమా. అప్ప‌టికి అటు ఇటుగా 50 కోట్ల‌తో తీయాల‌నుకున్నారు. కానీ త‌ర్వాత ప‌రిస్థితులు మారిపోయాయి. బాహుబ‌లి-1, బాహుబ‌లి-2 ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి రిలీజ‌య్యాయి. ప్రభాస్ రేంజ్ మారిపోయింది. అత‌డి మార్కెట్ ఊహించ‌ని స్థాయికి చేరుకుంది.

దీంతో పాటే సాహో బ‌డ్జెట్ కూడా అనూహ్యంగా పెరిగిపోయింది. అయిన‌ప్ప‌టికీ సినిమా మొద‌ల‌య్యే స‌మ‌యానికి బ‌డ్జెట్ రూ.150 కోట్ల‌కు అటు ఇటు అన్న‌ట్లుగా వార్త‌లొచ్చాయి. కానీ మేకింగ్ టైంలో బ‌డ్జెట్ ఫిగ‌ర్స్ ర‌క‌ర‌కాలుగా వినిపించాయి. దీనికి సంబంధించిన వార్త‌లు విని విని విసుగెత్తిపోయారు జ‌నాలు.

ఈ నేప‌థ్యంలో మీడియా వాళ్లు మొన్నటి ప్రెస్ మీట్లో ప్ర‌భాస్‌ను సాహో బ‌డ్జెట్ గురించి అడిగేశారు. బాహుబ‌లి కంటే దీని బ‌డ్జెట్ ఎక్కువైంద‌ట క‌దా అంటే నిజ‌మే అని ప్ర‌భాస్ బ‌దులివ్వ‌డం విశేషం. అయితే బాహుబ‌లి రెండు భాగాల‌కు క‌లిపి అయిన‌ట్లుగా చెప్పిన బ‌డ్జెట్ రూ.450 కోట్లు. ప్ర‌భాస్ ఒక భాగాన్ని యూనిట్‌గా భావించి.. అంత‌కంటే సాహో బ‌డ్జెట్ ఎక్కువ అని ఉండొచ్చు.  

ప్ర‌భాస్ మాట‌లు.. చిత్ర వ‌ర్గాల స‌మాచారాన్ని బ‌ట్టి చూస్తే మాత్రం సాహో బ‌డ్జెట్ రూ.350 కోట్ల‌న్న‌ది అంచ‌నా. మొన్న‌టి ట్రైల‌ర్లో విజువ‌ల్స్ చూస్తే ఈ బ‌డ్జెట్ మ‌రీ ఎక్కువేమీ అనిపించ‌దు. ఆ మాత్రం ఖ‌ర్చు పెట్ట‌క‌పోతే అలాంటి ఔట్ పుట్ రాదు. అబుదాబిలో తీసిన యాక్ష‌న్ ఎపిసోడ్ కోసం మాత్ర‌మే రూ.100 కోట్లు ఖ‌ర్చ‌యిన‌ట్లు స‌మాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English