ఆ హీరో వేలు పెడితేనే డైరెక్టర్స్‌ హ్యాపీ

ఆ హీరో వేలు పెడితేనే డైరెక్టర్స్‌ హ్యాపీ

కొందరు హీరోలకి తాము పని చేసే చిత్రాల స్క్రిప్టులో వేళ్లు పెట్టడం అలవాటు. సాధారణంగా దర్శకులు తమ క్రియేటివ్‌ సైడ్‌ని హీరోలు టచ్‌ చేసే ఇష్టపడరు. కానీ స్టార్‌డమ్‌ తెచ్చుకున్న హీరోలకి ఎదురు చెప్పలేక చాలా మంది దర్శకులు సైలెంట్‌గా వుంటారు.

కానీ ఒక హీరో మాత్రం కథలో వేళ్లు పెట్టాలని, వీలయినంతగా ఇన్‌వాల్వ్‌ కావాలని దర్శకులు కోరుకుంటున్నారు. అతనే అడివి శేష్‌. దర్శకుడు కావాలనే వచ్చిన శేష్‌కి క్రియేటివిటీ చాలా ఎక్కువ.

క్షణం, గూఢచారి చిత్రాల విజయాలలో శేష్‌ ఇన్‌వాల్వ్‌మెంట్‌ చాలా వుంది. ఈ సంగతి నిర్మాతలకి కూడా బాగా తెలుసు కనుక అతడికి ఫుల్‌ క్రియేటివ్‌ ఫ్రీడమ్‌ ఇచ్చేస్తున్నారు. అతని తాజా చిత్రం 'ఎవరు' ఒక స్పానిష్‌ చిత్రానికి రీమేక్‌. 'ఇన్విజిబుల్‌ గెస్ట్‌' అనే ఆ చిత్రం ఇటీవలే హిందీలోకి 'బద్‌లా'గా రీమేక్‌ అయి ఘన విజయాన్ని అందుకుంది.

ఇంతవరకు వివిధ భాషలలోకి రీమేక్‌ అయిన ఆ చిత్రం స్క్రీన్‌ప్లేని, ప్లాట్‌ ట్విస్టులని ఎవరూ మార్చలేదు. బద్‌లాలో కేవలం ఆడ, మగ పాత్రలని అటు, ఇటు చేసారే తప్ప మిగతాదంతా అలాగే వుంచేసారు.

కానీ శేష్‌ మాత్రం ఆ కథని, ట్విస్ట్‌ని కూడా మార్చేసాడు. ఇన్విజిబుల్‌ గెస్ట్‌ చూసిన వారు కూడా ఊహించలేని ట్విస్ట్‌ ఒకటి ఇచ్చాడట. ఈ చిత్రంపై సూపర్‌ కాన్ఫిడెంట్‌గా వుండడంతో విడుదలకి ఒక్కరోజు ముందే రెడ్‌ కార్పెట్‌ ప్రీమియర్‌ కూడా ప్లాన్‌ చేస్తున్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English