రాజమౌళి ప్రెజర్‌ ఫీలవుతున్నాడా?

రాజమౌళి ప్రెజర్‌ ఫీలవుతున్నాడా?

'బాహుబలి' తర్వాత ఎలాంటి సినిమా చేస్తే దేశ వ్యాప్తంగా క్రేజ్‌ వస్తుందనేది ప్రభాస్‌ పర్‌ఫెక్ట్‌గా స్టడీ చేసాడు. సాహోతో ఇప్పటికే అక్కడ మరో స్ట్రాంగ్‌ ఓపెనింగ్‌ ఖాయమనే నమ్మకం కలిగించాడు. ఈ చిత్రం ట్రెయిలర్‌ చూసి అందరూ ఔరా అంటోంటే... రాజమౌళి మాత్రం ఇంకా ట్వీట్‌ కూడా చేయలేదు.

ట్రెయిలర్‌ చూసి ప్రభాస్‌ని అభినందించాడట కానీ ఒక రెండు నిమిషాలు వెచ్చించి ట్విట్టర్‌లో ఆ ప్రశంసలు పోస్ట్‌ చేయలేదు. మామూలుగా ఇతరులు ఏదైనా బృహత్తరమైన పని చేపడితే ఎంకరేజ్‌ చేయడానికి ముందుండే రాజమౌళి తన బాహుబలి హీరోకి దోహదపడే ట్వీట్‌ ఎందుకు చేయలేకపోయాడనేది చర్చకి దారి తీసింది.

ఏదేమైనా రాజమౌళి ఈమధ్య బాగా ఇనాక్టివ్‌గా వుంటున్నాడు. బాహుబలి తీసే టైమ్‌లో రాజమౌళి అంతగా ఒత్తిడికి గురయినట్టు లేడు. కానీ 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రం విషయంలో రాజమౌళి అనుకున్నట్టుగా ఏదీ జరగడం లేదు.

హీరోలు గాయాల పాలవడం వల్ల షూటింగ్‌ సజావుగా సాగడం లేదు. హీరోయిన్లు కూడా దొరకడం లేదు. బాహుబలి తర్వాత ఏ సినిమా చేస్తే కరక్ట్‌ అనే అంచనాలో రాజమౌళి రాంగ్‌ స్టెప్‌ వేసినట్టు భావిస్తున్నాడా లేక తాను ఎంత లో ప్రొఫైల్‌లో వుంటే అంతగా అంచనాలని తగ్గించవచ్చునని కావాలనే ఇలా చేస్తున్నాడా అనేది తెలీదు. కానీ జక్కన్న మాత్రం ఇటీవల ఏదో విధంగా టాపిక్‌ అవుతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English