'సాహో' మ్యాజిక్‌ 'సైరా' వల్ల ఇంపాజిబుల్‌!

'సాహో' మ్యాజిక్‌ 'సైరా' వల్ల ఇంపాజిబుల్‌!

'సాహో' చిత్రానికి బాలీవుడ్‌లో అంత క్రేజ్‌ ఏర్పడడానికి కారణం 'బాహుబలి' ఎఫెక్ట్‌ అనేది కాదనలేని నిజం. ఆ చిత్రంతో ప్రభాస్‌ అక్కడి వారికి అంతగా రిజిష్టర్‌ కాకపోతే సాహోని పెద్దగా పట్టించుకునే వారు కాదు.

అయితే ప్రభాస్‌కి ఇది నిలకడ అయిన మార్కెట్‌ అవుతుందా లేదా అనే సాహోతో పాటు తదుపరి రెండు, మూడు చిత్రాలు తేలుస్తాయి. అయితే సాహో చిత్రానికి బాలీవుడ్‌లో ఏర్పడిన క్రేజ్‌ చూసి 'సైరా' లాంటి చిత్రాలకి కూడా అలాంటి ఆకర్షణ తీసుకు రావాలనే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మొన్నటి వరకు హిందీ వెర్షన్‌పై 'సైరా' యూనిట్‌ అంతగా ఆసక్తి చూపించలేదు.

అక్కడ్నుంచి అంతగా స్పందన లేదని హిందీ మార్కెట్‌ని లైట్‌ తీసుకుంది. కానీ సాహో కోసం నార్త్‌ ఆడియన్స్‌ అంతగా ఎదురు చూడడం చూసి సరిగ్గా ప్రమోట్‌ చేస్తే సైరాకి కూడా ఛాన్స్‌ వుంటుందనే భావనతో ఆ దిశగా పావులు కదుపుతోంది.

చిరంజీవి అక్కడి వారికి పరిచయస్తుడే అయినప్పటికీ బాహుబలితో ఈ జనరేషన్‌కి ప్రభాస్‌ దగ్గరయినంతగా మెగాస్టార్‌ అక్కడి వారికి రిజిష్టర్‌ అవలేదు. సైరా టీజర్‌, ట్రెయిలర్స్‌ని బట్టి అక్కడ కాస్త ఇంపాక్ట్‌ మొదలు కావచ్చు కానీ సాహో మాదిరి మ్యాజిక్‌ అయితే ఇంపాజిబుల్‌ అనే బాలీవుడ్‌ విశ్లేషకులు చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English