అవును.. జెర్సీ రీమేక్‌లో అత‌నే

అవును.. జెర్సీ రీమేక్‌లో అత‌నే

మ‌న సినిమా జెర్సీ తెలుగులో వ‌చ్చిన బెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ఇదే అనడంలో మ‌రో మాట లేదు. ఈ చిత్రం క‌మర్షియ‌ల్‌గానూ మంచి విజ‌యం సాధించింది.

దీంతో ఇత‌ర భాష‌ల వాళ్లు క‌ళ్లు వెంట‌నే దీని మీద ప‌డిపోయాయి. వివిధ ఇండ‌స్ట్రీల నుంచి రీమేక్ హ‌క్కుల కోసం పోటీ మొద‌లైంది. ఆల్రెడీ హిందీ, త‌మిళ భాష‌ల్లో రీమేక్‌లు క‌న్ఫ‌మ్ అయ్యాయి. హిందీలో హీరోగా షాహిద్ క‌పూర్ న‌టించొచ్చ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అది క‌న్ఫ‌మ్ కాలేదు.

ఐతే త‌మిళంలో మాత్రం జెర్సీ రీమేక్‌కు హీరో ఖ‌రార‌య్యాడు. ఇటీవ‌లే తెలుగులోకి రీమేక్ అయిన రాక్ష‌సుడు ఒరిజిన‌ల్లో హీరోగా న‌టించిన విష్ణు విశాల్ త‌మిళ జెర్సీలో హీరోగా న‌టించ‌నున్నాడు.

జెర్సీ సినిమా చూస్తూ ఒక మంచి విజువ‌ల్‌ను ట్విట్ట‌ర్లో షేర్ చేయ‌డం ద్వారా అత‌నీ విష‌యాన్ని ధ్రువీక‌రించాడు. ఈ చిత్రంలో క‌థానాయికగా అమ‌లా పాల్ ఓకే అయిన‌ట్లు స‌మాచారం. రాక్ష‌సుడు ఒరిజిన‌ల్లో హీరో హీరోయిన్లు వీళ్లిద్ద‌రే కావ‌డం విశేషం.

ఇంకో ముచ్చ‌టేంటంటే.. విష్ణు ఇంత‌కుముందే క్రికెట‌ర్ పాత్ర చేశాడు. జీవా అనే సినిమాలో క్రికెట్ కోసం ప్రాణం పెట్టే పాత్ర‌లో జీవించాడు. అది కూడా జెర్సీ లాగే చాలా ఇంటెన్స్‌గా సాగే సినిమానే. ఇప్పుడు మరోసారి మంచి కంటెంట్ ఉన్న క్రికెట్ బేస్డ్ మూవీలో విష్ణు ఎలా మురిపిస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English