ఆమిర్‌తో అత‌ను.. అదిరిపోలా

ఆమిర్‌తో అత‌ను.. అదిరిపోలా

బాలీవుడ్ హీరోల్లో అత్యంత గొప్ప న‌టుడు ఎవ‌రంటే మ‌రో మాట లేకుండా ఆమిర్ ఖాన్ పేరు చెప్పేయొచ్చు. ఇక అత‌ను ఎంచుకునే పాత్ర‌లు ఎంత వైవిధ్యంగా, బ‌లంగా ఉంటాయో తెలిసిందే. ఎప్పుడో కానీ అత‌డి జ‌డ్జిమెంట్ తేడా కొట్ట‌దు.

అందుకే ప్రేక్ష‌కుల‌కు ఆమిర్ మీద అపార‌మైన న‌మ్మ‌కం. అత‌డి సినిమా అంటే క‌ళ్లు మూసుకుని థియేట‌ర్ల‌కు వెళ్లిపోతారు. అలాంటి న‌టుడితో జ‌త క‌ట్ట‌డానికి ప్ర‌తి ఆర్టిస్టూ, టెక్నీషియ‌నూ ఆస‌క్తి చూపిస్తాడు.

ద‌క్షిణాది నుంచి గ‌త ద‌శాబ్ద కాలంలో వ‌చ్చిన అత్యుత్త‌మ న‌టుడు అన‌ద‌గ్గ విజ‌య్ సేతుప‌తి.. ఆమిర్ ఖాన్‌తో క‌లిసి న‌టించ‌బోతున్నాడ‌న్న వార్త ఇప్పుడు అమితాస‌క్తిని రేకెత్తిస్తోంది. స్వ‌యంగా విజ‌యే ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించ‌డం విశేషం.

కొన్ని రోజుల క్రితం విజ‌య్ సేతుప‌తి న‌టిస్తున్న ‘సంఘ తమిళన్‌’ షూటింగ్ స్పాట్‌కు ఆమిర్‌ఖాన్‌ వచ్చినట్లు వార్తలొచ్చాయి. దీంతో వీళ్లిద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారని కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ విషయం నిజమేనని ధ్రువీకరించాడు విజయ్‌.  

‘‘సంఘ తమిళన్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుండ‌గా ఒక‌సారి ఆమిర్ సార్ వచ్చిన మాట నిజమే. ఆయనతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నా. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడిస్తారు. ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి అని విజ‌య్ సేతుప‌తి తెలిపాడు.

నార్త్, సౌత్‌కు చెందిన ఇద్ద‌రు ఉత్త‌మ న‌టులు క‌లిసి సినిమా చేస్తున్నారంటే దానిపై దేశవ్యాప్తంగా ప్రేక్ష‌కుల్లో క్యూరియాసిటీ రావ‌డం ఖాయం. మరి వీళ్లిద్ద‌రూ క‌లిసి చేసే సినిమా ఏదో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English