నాగార్జునని మరీ అంత ఇబ్బంది పెట్టారా?

 నాగార్జునని మరీ అంత ఇబ్బంది పెట్టారా?

విడుదలైన ప్రతి సినిమాకీ సక్సెస్‌ మీట్‌ అయితే పెట్టాలి కాబట్టి లాంఛనంగా ప్రెస్‌ని కలిసారు మన్మథుడు 2 చిత్రబృందం. అయితే ఈ చిత్రాన్ని హిట్‌ అని చెప్పుకోవడానికి నాగార్జునకి మనసు వచ్చినట్టు లేదు. అందుకే తన సినిమాలు కొన్ని ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుని తర్వాత క్లాసిక్స్‌ అయ్యాయని, ఎప్పుడు కొత్తగా ట్రై చేసినా తనకి మొదట్లో అనుకూల ఫలితం రాలేదని గుర్తు చేసుకున్నాడు.

అయితే ఇదంతా మన్మథుడు 2 కూడా అలా అవుతుందని చెప్పడం లేదని నాగార్జున కరక్ట్‌ చేసుకున్నాడు. మరెందుకని ఈ ఉపోద్ఘాతం అంతా ఇచ్చాడనేది ఆయనకే తెలియాలి. ఈ చిత్రానికి వసూళ్లు బాగున్నాయని, అంతిమంగా వచ్చిన కలక్షన్లే గుర్తుంటాయని, వచ్చే వసూళ్లతో నిర్మాతలు హ్యాపీ అని అన్నాడు. మరి దీనిని స్ట్రెయిట్‌గా చెప్పకుండా ముందు చెప్పినదంతా ఎందుకు చెప్పినట్టు? సాధారణంగా ఫెయిల్‌ అయిన సినిమాల గురించి నాగార్జున బయటకి వచ్చి మాట్లాడడు. కానీ ఈ చిత్రానికి ఇతర నిర్మాతల ఒత్తిడి వల్ల బయటకి వచ్చినట్టున్నాడు.

అయితే తన శైలికి భిన్నంగా మాట్లాడలేక నాగ్‌ ఇలా కన్‌ఫ్యూజింగ్‌గా మాట్లాడేసి మన్మథుడు 2 సక్సెస్‌ మీట్‌ని ముగించేసాడు. బాక్సాఫీస్‌ పరంగా చూస్తే శని, ఆదివారాలలో కూడా వసూళ్లు బాగా తక్కువ వచ్చిన ఈ చిత్రం నిలదొక్కుకోవడం కష్టమేనని ట్రేడ్‌ విశ్లేషకులు తేల్చేసారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English