ప్రభాస్‌ ప్రభంజనంతో షేక్‌ అవుతున్నారు

ప్రభాస్‌ ప్రభంజనంతో షేక్‌ అవుతున్నారు

దక్షిణాది నుంచి వచ్చిన వాళ్లు బాలీవుడ్‌లో పాగా వేయడాన్ని అక్కడి వాళ్లు అస్సలు హర్షించలేరు. ఇంతవరకు అక్కడ అంతగా ప్రభావం చూపించిన దక్షిణాది హీరో కూడా లేడు. కానీ బాహుబలితో జాతీయ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించిన ప్రభాస్‌ కొత్త సినిమా కోసం ఉత్తరాదిలో మనకంటే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సాహో ట్రెయిలర్‌ని హిందీలో కాస్త ఆలస్యంగా విడుదల చేసారు. దాంతో ఇనీషియల్‌గా చూడాలనే ఆత్రుత వున్నవాళ్లంతా తెలుగు, తమిళం ట్రెయిలర్లు చూసేసారు.

లేట్‌గా రిలీజ్‌ చేసినా కానీ సాహో హిందీ ట్రెయిలర్‌ ఆల్రెడీ నలభై మిలియన్ల వ్యూస్‌ హిందీలోనే సాధించింది. అక్కడి సూపర్‌స్టార్‌ సినిమాలకి తప్ప ఇలాంటి స్పందన మరెవరికీ రాదు. ఇంతకాలం ఏదో ఆరంభ శూరత్వంగానే చూసిన ప్రభాస్‌ని ఇప్పుడు బాలీవుడ్‌ స్టార్లు త్రెట్‌గా, కాంపిటీషన్‌గా చూస్తున్నారు. సాహో కనుక హిందీలో రెండు వందల కోట్ల నెట్‌ వసూళ్లని సాధించినట్టయితే ఇక అక్కడ చాలా మంది ఫౌండేషన్లు షేక్‌ అవుతాయి.

అతనికి తెలుగులో ఎలాగో నూట యాభై కోట్ల షేర్‌ తెచ్చే సత్తా వుందని ట్రేడ్‌ నమ్ముతోంది. హిందీ, తమిళంలో స్టాండర్డ్‌ మార్కెట్‌ని సాహో సాధించినట్టయితే మాత్రం ప్రభాస్‌ జాతీయ స్థాయిలో సూపర్‌స్టార్‌ అవుతాడు. ఇంతవరకు ఏ హీరో అయినా ఒక మార్కెట్లో సూపర్‌స్టార్‌ అయి, మిగతా చోట్ల స్టార్‌ స్టేటస్‌ మాత్రం అనుభవించాడు కానీ అన్ని చోట్లా సూపర్‌స్టార్‌ అనిపించుకోలేదు. సాహోతో బాహుబలిలో సగం విజయాన్ని అందుకున్నా కానీ ప్రభాస్‌ ఈ ఘనత దక్కించుకోగలుగుతాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English