బిగ్‌బాస్‌ మేనిప్యులేషన్‌ కంటిన్యూస్‌

బిగ్‌బాస్‌ మేనిప్యులేషన్‌ కంటిన్యూస్‌

గత సీజన్‌లో స్టార్‌ కంటెస్టెంట్లని చివరి వరకు కాపాడుకోలేకపోయిన బిగ్‌బాస్‌ ఈసారి చాలా స్ట్రాటజిక్‌గా వ్యవహరిస్తోంది. తాము ఎవరైతే హౌస్‌లో ఎక్కువ రోజులు వుండాలని కోరుకుంటున్నారో వారిని నెగెటివ్‌గా చూపించకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎడిటింగ్‌ పరంగా తీసుకుంటోన్న జాగ్రత్తలే కాకుండా షోకి వచ్చే అతిథులకి కూడా ఎవరి గురించి ఏమి మాట్లాడాలనేది చెప్పి పంపిస్తున్నారు.

ఆదివారం ఎపిసోడ్‌కి గెస్ట్‌గా వచ్చిన వెన్నెల కిషోర్‌ హౌస్‌లోని అందరిపైన సెటైర్లు వేసాడు కానీ శ్రీముఖిని మాత్రం ఆకాశానికి ఎత్తేసాడు. అలాగే పునర్నవిలో అసలు నెగెటివ్స్‌ లేనట్టు ఎలా వున్నారో అలాగే వుండండి అని చెప్పాడు. పునర్నవికి ఒక ఈజీ సీక్రెట్‌ టాస్క్‌ ఇచ్చి నామినేషన్లలోకి రాకుండా చూసుకోవడంతోనే అనుమానాలు స్టార్ట్‌ అయ్యాయి. వెన్నెల కిషోర్‌ మాటలతో నిజంగానే ఆర్గనైజర్ల అండ ఆమెకి వుందని తేలిపోయింది.

అయితే బాబా భాస్కర్‌ని మాత్రం బిగ్‌బాస్‌ సైడ్‌ చేయలేకపోతున్నాడు. క్రౌడ్‌ ఫేవరెట్‌గా మారిన బాబా భాస్కర్‌కి అత్యధిక ఓట్లు వచ్చినా కానీ అతడిని మూడవ వ్యక్తిగా సేవ్‌ చేసి కాన్ఫిడెన్స్‌ దెబ్బ కొట్టారు. అయినప్పటికీ తమన్నా సింహాద్రి వెళ్లిపోతూ అతడిపై ప్రశంసలు కురిపించడంతో అతనిపై పబ్లిక్‌ సింపతీ ఇంకాస్త పెరిగింది. దానిని తగ్గించడానికి బిగ్‌బాస్‌ ఇకపై ఎలాంటి ఎత్తులు వేస్తాడనేది ఆసక్తికరం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English