కామ్రేడ్ దెబ్బ‌కు హీరో ఔట్‌?

కామ్రేడ్ దెబ్బ‌కు హీరో ఔట్‌?

ఎంత ఊపుమీదున్న హీరోకైనా ఒక్క పెద్ద ఫ్లాప్ చాలు.. బ్రేక్ వేయ‌డానికి. ఇక తిరుగులేదు అనుకున్న చాలామంది స్టార్ హీరోల‌కు ఇలాంటి ఎదురు దెబ్బ‌లే త‌గిలాయి. ఇప్పుడు ఈ వ‌రుస‌లోకి విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా వ‌చ్చి చేరాడు. స్యూర్ షాట్ హిట్ లాగా క‌నిపించిన డియ‌ర్ కామ్రేడ్.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా ప‌డ‌టం విజ‌య్ కెరీర్‌ను గ‌ట్టి దెబ్బే తీసేలా క‌నిపిస్తోంది.

విజ‌య్‌తో బ‌ల‌మైన బంధం ఏర్ప‌రుచుకున్న‌ట్లుగా క‌నిపించిన మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ అత‌డి నుంచి దూరం జ‌రుగుతున్న‌ట్లుగా తాజా స‌మాచారం. యాష్ రంగినేని ఒక్క‌డే నిర్మించాల్సిన డియ‌ర్ కామ్రేడ్‌ను త‌న చేతుల్లోకి తీసుకుని.. దాన్ని పెద్ద స్కేల్‌లో తీసిన మైత్రీ సంస్థ‌.. ఈ సినిమాకు మంచి బిజినెస్ జ‌ర‌గ‌డంతో ఉత్సాహంగా విజ‌య్ త‌ర్వాతి సినిమాను కూడా ప్రొడ్యూస్ చేయ‌డానికి ముందుకొచ్చింది.

ఆనంద్ అన్నామ‌లై అనే కొత్త ద‌ర్శ‌కుడితో హీరో అనే చిత్రాన్ని భారీ బ‌డ్జెట్లో తీయ‌డానికి స‌న్నాహాలు చేసింది. రెండు నెల‌ల కింద‌టే ఆ చిత్రం ప్రారంభోత్స‌వం జ‌రుపుకుంది. ఆ త‌ర్వాత కొన్ని రోజులు షూటింగ్ చేశారు కూడా. కానీ అయినంత వ‌ర‌కు ర‌షెస్ చూస్తే సంతృప్తిక‌రంగా లేద‌ని.. దీనికి బ్రేక్ వేశారు. స్క్రిప్టు మీద మ‌ళ్లీ ప‌ని చేసి.. కొంత విరామం త‌ర్వాత సినిమా పునఃప్రారంభించాల‌నుకున్నారు.

కానీ తాజా స‌మాచారం ప్రకారం హీరో సినిమాను పూర్తిగా ప‌క్క‌న పెట్టేస్తున్నార‌ట‌. డియ‌ర్ కామ్రేడ్ దెబ్బ‌కు విజ‌య్ మార్కెట్ దెబ్బ తింది. తాము అనుకున్న బ‌డ్జెట్లో హీరోను పూర్తి చేసి మార్కెట్ చేసుకోవ‌డం క‌ష్ట‌మ‌ని మైత్రీ సంస్థ భావిస్తోంద‌ట‌. ద‌ర్శ‌కుడి ప‌నిత‌నం మీద కూడా సందేహాలు రేకెత్త‌డంతో సినిమా తేడా కొడితే నిండా మునుగుతామ‌ని భావించి.. ఇప్ప‌టిదాకా పెట్టిన ఖ‌ర్చు పోయినా ప‌ర్వాలేద‌ని సినిమాను ప‌క్క‌న పెట్టేసిన‌ట్లుగా టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English