జగన్ అమెరికా టూర్.. వారం రోజులు అగ్రరాజ్యంలో

జగన్ అమెరికా టూర్.. వారం రోజులు అగ్రరాజ్యంలో

ఏపీ సీఎం జగన్ రెండు నెలల పాలన తరువాత విదేశీ టూర్లు ప్రారంభిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడులు సాధించే క్రమంలో ఆయన ఎన్నారైలలో నమ్మకం కల్పించేందుకు.. వారిని ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించేందుకు విదేశాలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లు ప్రభత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన త్వరలో అమెరికా పర్యటనకు వెళ్తున్నారని చెబుతున్నారు.

జగన్ ఈ నెల 15 నుంచి 24 వరకూ కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాకు వెళ్తున్నారు. ఈ నెల 15 న సాయంత్రం హైద్రాబాద్ నుంచి ఆయన బయలుదేరుతారు. 17 న ఉత్తరమెరికా లోని డల్లాస్ లో ప్రవాస తెలుగువారితో సీఎం జగన్ భారీ సభ ఉంటుంది. సీఎం హోదాలో మొదటిసారి ప్రవాస తెలుగువారితో ఆత్మీయస్ సమావేశంలో ఆయన పాల్గొంటున్నారు. అక్కడి నుంచి తిరిగి ఈ నెల 24న అమరావతికి చేరుకుంటారాయన.

అయితే.. ఇది పూర్తిగా పెట్టుబడులకు ఉద్దేశించిందని కాదు. ఎన్నారైలతో ప్రాథమికంగా భేటీ కావడమే దీని లక్ష్యంగా చెబుతున్నారు. మరోవైపు జగన్ ఇటీవలే తన జెరూసలెం పర్యటన పూర్తిచేసుకున్నారు. అది పూర్తిగా ఆయన వ్యక్తిగత పర్యటన.

ముందుముందు విదేశీ వేదికలపై జరిగే వాణిజ్య, పెట్టుబడుల సదస్సులకూ జగన్ హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ ఎక్కడికి వెళ్లినా అందులో రాష్ట్ర ప్రయోజనాలే ఉంటాయని పార్టీ నేతలు అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English