సాహో.. బాహుబలిని మించి

సాహో.. బాహుబలిని మించి

బాహుబ‌లిని ఏ ర‌కంగానూ అందుకునే మ‌రో సినిమా ఇప్పుడిప్పుడే రాద‌నే అంతా అనుకున్నారు. దేశ‌వ్యాప్తంగా అంత క్రేజ్ తెచ్చుకోవ‌డం అంటే మాట‌లు కాదు. అంత పెద్ద స్థాయిలో ఓ సినిమాను రిలీజ్ చేయ‌డం కూడా క‌ష్ట‌మే అని అంతా అనుకున్నారు. దీని త‌ర్వాత వ‌చ్చిన‌ బాలీవుడ్ సినిమాలు సైతం  అంత భారీగా రిలీజ్ కాలేదు.

ఐతే మ‌ళ్లీ ప్ర‌భాసే సాహో చిత్రంతో బాహుబ‌లి స్థాయిలో మోత మోగించ‌డానికి రెడీ అవుతుండ‌టం విశేషం. ఈ సినిమాను బాహుబ‌లికి దీటుగా.. కుదిరితే దాని కంటే భారీగా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతుండ‌టం విశేషం. ఈ దిశ‌గా చిత్ర బృందం ఇప్ప‌టికే సంకేతాలు కూడా ఇచ్చేసింది.

సాహో సినిమాను హిందీలో రిలీజ్ చేయ‌బోతున్న భూషణ్ కుమార్.. ఉత్త‌రాది వ‌ర‌కే ఈ చిత్రాన్ని హిందీలో 4500 స్క్రీన్ల‌లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఇది ద‌క్షిణాది రాష్ట్రాల్ని.. విదేశీ స్క్రీన్ల‌ను మిన‌హాయించి చెబుతున్న లెక్క‌. ఉత్త‌రాదిన మొత్ం ఎన్ని స్క్రీన్ల‌లో రిలీజ్ చేస్తారో.. అంతే స్థాయిలో ద‌క్షిణాదిలోని నాలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయ‌డానికి ఆస్కార‌ముంది.

ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే రెండు వేల స్క్రీన్ల‌లో సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నారు. మిగ‌తా మూడు రాష్ట్రాల్లో థియేట‌ర్ల సంఖ్య 2 వేల‌కు త‌గ్గ‌క‌పోవ‌చ్చు. ఇంకా విదేశాల్లో వంద‌ల సంఖ్య‌లో స్క్రీన్లు యాడ్ అవుతాయి. అంటే మినిమం 10 వేల థియేట‌ర్ల‌లో సాహో ప్ర‌భంజ‌నం చూడ‌బోతున్నామ‌న్న‌మాట‌. ట్రైల‌ర్ త‌ర్వాత అంచ‌నాలు ఇంకా పెరిగిపోయిన నేప‌థ్యంలో టాక్ ఎలా ఉన్న‌ప్ప‌టికీ బాహుబ‌లికి దీటుగా సాహోకు ఓపెనింగ్స్ రావ‌డం ఖాయ‌మ‌నిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English