రాహుల్‌కి భార్య చేసిన డ్యామేజ్‌ ఎక్కువ

రాహుల్‌కి భార్య చేసిన డ్యామేజ్‌ ఎక్కువ

ఏదైనా సినిమా విడుదలైతే అది ఫ్లాప్‌ అవ్వాలంటూ అందులోని హీరో వ్యతిరేకులు ఎదురు చూస్తుంటారు. కానీ 'మన్మథుడు 2' చిత్రానికి మాత్రం నాగార్జున వ్యతిరేకుల కంటే సింగర్‌ చిన్మయి సోషల్‌ మీడియాలో చేసే పోస్ట్‌లు నచ్చని వారు ఎక్కువగా ఎదురు చూసారు.

చిన్మయి భర్త రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకుడు కావడంతో 'మన్మథుడు 2' చాలా కాలంగా ట్రోలర్స్‌ లిస్టులో వుంది. ఈ చిత్రానికి ఎప్పుడయితే బ్యాడ్‌ టాక్‌ వచ్చిందో ఇక చిన్మయిని ట్విట్టర్లో తగులుకున్నారు.

ఫెమినిస్టుల తరఫున వకాల్తా తీసుకునే చిన్మయి తన భర్త ఇలా ఆడవాళ్లని వస్తువుల్లా ట్రీట్‌ చేసే సినిమా ఎలా తీసాడంటూ ఆమెని గట్టిగా ట్రోల్‌ చేసారు. మామూలుగా తనకి వచ్చే నెగెటివ్‌ ట్వీట్స్‌ అన్నిటికీ రియాక్ట్‌ అయ్యే చిన్మయి ఇవన్నీ చూడనట్టే సైలెంట్‌గా వుండిపోయింది.

అయితే లక్కీగా అదే రోజు సాయంత్రానికి ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా చిలసౌ చిత్రానికి రాహుల్‌ జాతీయ అవార్డు గెలుచుకోవడంతో చిన్మయి ఆ ఆనందంలో మునిగి తేలింది. ట్రోలర్స్‌ తమ పనిలో తాము వున్నా కానీ తన భర్త రాక్‌స్టార్‌ అంటూ మురిసిపోయింది.

మన్మథుడు 2 పరాజయాన్ని మరిపిస్తూ రాహుల్‌కి శనివారం సాక్షి నుంచి కూడా బెస్ట్‌ డెబ్యూ డైరెక్టర్‌గా అవార్డ్‌ వచ్చింది. ఏదేమైనా మన్మథుడు నెగెటివ్‌ ఫీడ్‌బ్యాక్‌కి చిన్మయి ఎక్కువగా కారణమయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English