అక్కినేని పగ్గాలు సమంతకిస్తే బెస్టా?

అక్కినేని పగ్గాలు సమంతకిస్తే బెస్టా?

నాగార్జున ఒకానొక టైమ్‌లో స్క్రిప్ట్‌ని బాగా అధ్యయనం చేసేవాడు. ఏ సినిమా వర్కవుట్‌ అవుతుంది, ఏది జనాలకి కొత్తగా అనిపిస్తుందనేది అంచనా వేసి కొన్ని క్లాసిక్‌ సినిమాలని అందించాడు. అయితే ఇటీవల నాగార్జున జడ్జిమెంట్‌ గాడి తప్పుతోంది.

తను చేసే సినిమాలని సరిగా జడ్జ్‌ చేయలేకపోవడంతో పాటు తనయులతో తీసే చిత్రాలకి కూడా నాగార్జున వరుసగా తప్పులు చేస్తున్నాడు. నిర్మల కాన్వెంట్‌ నుంచి మొదలైన ఈ బ్యాడ్‌ జడ్జిమెంట్‌ 'మన్మథుడు 2' వరకు కొనసాగింది.

అక్కినేని కాంపౌండ్‌లో ఇప్పుడు సమంత స్క్రిప్ట్‌ని మిగతా అందరి కంటే బెటర్‌గా జడ్జ్‌ చేస్తోంది. తాను నటించే సినిమాలే కాకుండా భర్తకి కూడా మజిలీలాంటి విజయానికి దోహదపడింది. సమంత పెళ్లి కాకముందు కూడా ఎక్కువగా హిట్‌ చిత్రాల్లోనే నటించింది.

దీనిని బట్టి సమంతకి స్క్రిప్టు ఫైనలైజ్‌ చేసే బాధ్యతలు అప్పగిస్తే మళ్లీ అక్కినేని వారికి హిట్లు పెరుగుతాయేమో. అటు అఖిల్‌కి, ఇటు అన్నపూర్ణ స్టూడియోస్‌కి కూడా హిట్టు లేక చాలా కాలమవుతోంది. వరుస అపజయాలతో అభిమానుల్లోను అసహనం పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో మంచి కథలని ఎంచుకుని ట్రెండ్‌కి తగ్గ సినిమాలు చేస్తే తప్ప ప్రయోజనం వుండదు మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English