ఎన్టీఆర్‌కి చేసిన బ్లండర్‌ అదే

ఎన్టీఆర్‌కి చేసిన బ్లండర్‌ అదే

సావిత్రి జీవిత కథని సినిమా తీస్తే బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయంతో పాటు ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం కూడా లభించింది. అంతగా అనుభవం లేని నటి అయినా కానీ కీర్తి సురేష్‌ ఆ పాత్రలో జీవించి ఉత్తమ నటిగా జాతీయ స్థాయిలో పురస్కారాన్ని గెలుచుకుంది.

మహానటిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తోంటే అదే సమయంలో నందమూరి అభిమానులు 'ఎన్టీఆర్‌' బయోపిక్‌కి దక్కాల్సిన గౌరవాన్ని పాడు చేసారంటూ తిట్టుకుంటున్నారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ని కూడా ఇంత బాగా ప్లాన్‌ చేసుకున్నట్టయితే ఆ చిత్రానికి కూడా మంచి పురస్కారాలు లభించే ఆస్కారం వుండేదని, ఎన్టీఆర్‌గా నటించిన బాలయ్యకి కూడా కొన్ని మరచిపోలేని అవార్డులు వచ్చేవని అనుకుంటున్నారు.

బయోపిక్‌ ఎలా తీయాలనే దానికి దిక్సూచిలా నిలిచిపోయిన మహానటిని మరెవరూ ఇంతవరకు అనుసరించకపోవడం విడ్డూరమే. ఎన్టీఆర్‌కి అయితే రెండు భాగాలుగా విడదీయాలి, వ్యాపార పరంగా డబుల్‌ లాభాలు ఆర్జించాలి అని చూడడం రివర్స్‌ అయింది. అటు ఆ చిత్రం బాక్సాఫీస్‌నీ గెలవలేక, ఇటు పురస్కారాలకి నోచుకునే స్థాయి లేక మిగిలిపోయింది.

ఇక మీదట ఎవరైనా బయోపిక్‌ తలపెడితే మహానటితో పాటు అంతర్జాతీయంగా వచ్చిన అనేక బయోపిక్స్‌ని చూసి ఎలా తీయాలనేది ప్లాన్‌ చేసుకోవాలే తప్ప ఇలా రాంగ్‌ ట్రాక్‌ పట్టకూడదని విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English