రామ్.. మత్తు నుంచి బయటికి రాడా?

రామ్.. మత్తు నుంచి బయటికి రాడా?

యువ కథానాయకుడు రామ్ చూడ్డానికి చాలా సాఫ్ట్‌గా కనిపిస్తాడు. అతడిని చాలామంది చాక్లెట్ బాయ్ అని అంటుంటారు. బేసిగ్గా అతడికి లవర్ బాయ్ క్యారెక్టర్లే బాగా సూటవుతాయి అనిపిస్తుంది. కొంచెం యాక్షన్ జోడిస్తే ఓకే కానీ.. పూర్తి స్థాయి మాస్ క్యారెక్టర్లలో రామ్ ఏ మేరకు ఇమడగలడు అనే సందేహాలు కలుగుతుంటాయి. కానీ రామ్ మాత్రం ఎక్కువగా మాస్ క్యారెక్టర్లు చేయడానికే ఇష్టపడుతుంటాడు.

కటౌట్ పెద్దగా లేకపోయినా.. ఒకేసారి పదుల సంఖ్యలో విలన్లను బాదేసే క్యారెక్టర్లంటే అతడికి మహా ప్రీతి. ఈ కోవలోనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ చేశాడు. ఇది బెడిసికొట్టొచ్చని చాలామంది అంచనా వేశారు కానీ.. అనూహ్యంగా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం అందుకుంది. రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

మరి ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ చేయబోయే సినిమా ఏది.. ఈసారి అతను ఎలాంటి పాత్ర ఎంచుకుంటాడు అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’కు కొనసాగింపుగా పూరి ‘డబుల్ ఇస్మార్ట్’ చేయాలనుకుంటున్నాడు కానీ.. అందులో  హీరో రామ్ కాదు, విజయ్ దేవరకొండ అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పూరి ఎవరితో ఆ సిినిమా చేస్తాడన్నది పక్కన పెడితే.. ఈ చిత్రం పట్టాలెక్కడానికి సమయం పట్టొచ్చు. ఈలోపు రామ్ వేరే సినిమా చేయడానికి ఆస్కారముంది.

ఆ సినిమా ఎవరితో అన్నదే సస్పెన్సుగా మారింది. ఐతే రామ్ ఆల్రెడీ ఒక సినిమాకు సన్నద్ధమయ్యే ప్రయత్నంలో ఉన్నాడని అతడి లేటెస్ట్ లుక్ చూస్తే అర్థమవుతోంది. గుండు చేయించుకుని, ఫ్రెంచ్ బీర్డ్‌తో చాలా కొత్తగా కనిపిస్తూ తాజాగా ఒక లుక్ వదిలాడు రామ్. అది చూస్తే ఎలా ఉండే రామ్ ఎలా అయిపోయాడనే ఫీలింగ్ జనాలకు కలుగుతోంది. ‘ఇస్మార్ట్ శంకర్’ దెబ్బకు పూర్తిగా ఊరమాస్‌గా తయారై.. తన ఛార్మ్‌నంతా కోల్పోయాడని ఫీలవుతున్న ఫ్యాన్స్ కూడా ఉన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English