తేజ తర్వాతి సినిమా అతడితోనా?

తేజ తర్వాతి సినిమా అతడితోనా?

‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో లేక లేక ఒక హిట్టు కొట్టాడు తేజ. దశాబ్దంన్నర తర్వాత తేజకు దక్కిన హిట్ అది. అతను గాడిన పడ్డాడని.. ఇకపై మంచి సినిమాలు వస్తాయని ఆశించారు. కానీ తేజ నుంచి దీని తర్వాత వచ్చిన ‘సీత’ బెడిసికొట్టింది. తేజ మళ్లీ పూర్వపు ఫామ్ అందుకునేలా చేసింది. దీంతో మళ్లీ తేజ కొత్త సినిమా పట్టాలెక్కడంలో ఇబ్బందులు తప్పలేదు.

‘సీత’ విడుదలై మూడు నెలలు దాటినా ఇంకా తేజ కొత్త సినిమా గురించి ప్రకటన రాలేదు. టాలీవుడ్లో చాలా మంది హీరోలు తేజతో పని చేయడానికి ఆసక్తిగా లేరు. ఈ నేపథ్యంలో తేజ ఒక ఫ్లాప్ హీరోను నమ్ముకున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఆ హీరో మరెవరో కాదు.. గోపీచంద్. హిట్టు అనే మాట విని చాలా కాలం అయిపోయినా గోపీ ప్రయత్నం మానట్లేదు. త్వరలో అతను ‘చాణక్య’ సినిమాతో పలకరించబోతున్నాడు.

ఫ్లాపుల మాటెలా ఉన్నా గోపీ వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. సంపత్ నంది, శ్రీవాస్ లాంటి దర్శకుల సినిమాలకు అతను ఆల్రెడీ ఆమోద ముద్ర వేసినట్లు వార్తలొచ్చాయి. తాజా సమాచారం ప్రకారం తేజ చెప్పిన ఓ కథకు కూడా అతను ఓకే చెప్పాడట. తేజ విషయంలో గోపీలో కృతజ్ఞతా భావం ఉంటుందనడంలో సందేహం లేదు. ‘తొలి వలపు’తో హీరోగా దారుణమైన ఎదురు దెబ్బ తిన్న సమయంలో అతడిని విల్ పాత్రలోకి మార్చి ‘జయం’ సినిమా తీశాడు తేజ.

ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో.. గోపీకి ఎంత పేరు తెచ్చిందో తెలిసిందే. ఆ తర్వాత ‘వర్షం’లోనూ విలన్‌గా మెప్పించి ప్రేక్షకులకు చేరువైన గోపీ.. ఆపై ‘యజ్ఞం’ సినిమాతో హీరోగా పునరాగమనం చేశాడు. ఆ సినిమా హిట్టవడంతో వెనుదిరిగి చూసుకోలేదు. అప్పటి సాయాన్ని గుర్తుపెట్టుకుని తేజతో హీరోగా సినిమా చేయడానికి గోపీ ఓకే అన్నట్లుగా సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English