రణరంగం టీం భయపడుతోందా?

రణరంగం టీం భయపడుతోందా?

ఈ వారం సినిమాల సంగతి తేలిపోయింది. ఇక ఫోకస్ తర్వాతి వారాంతంలో వచ్చే సినిమాలపైకి మళ్లింది. ఇండిపెండెన్స్ డే వీకెండ్లో వస్తున్న రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తే ఉంది. అందులో ‘ఎవరు’తో పోలిస్తే ‘రణరంగం’ మీదే అంచనాలు ఎక్కువగ ఉన్నాయి. కథల ఎంపికలో మంచి అభిరుచి ఉన్న శర్వానంద్ హీరోగా నటించడం ఈ చిత్రానికి పెద్ద ఆకర్షణ.

దర్శకుడు సుధీర్ వర్మ ట్రాక్ రికార్డు ఏమంత బాగా లేకున్నా.. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ తీసుకురాగలిగాడు. ప్రోమోల్ని బట్టి చూస్తే ఓవర్సీస్‌లో ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గ సినిమాలా ఇది కనిపిస్తోంది. కానీ చిత్ర బృందం ఆశ్చర్యకరంగా ‘రణరంగం’కు ముందు రోజు యుఎస్ ప్రిమియర్లు వద్దని డిసైడైనట్లుగా వస్తున్న వార్తలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

ఓవర్సీస్ వసూళ్లలో ప్రిమియర్లది కీలక పాత్ర. క్రేజున్న సినిమాలకు ఫ్యాన్సీ రేట్లు పెట్టి పెద్ద ఎత్తున ప్రిమియర్లు వేయడం కామన్. ఇండియా కంటే ముందు షో చూసేందుకు యుఎస్ ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తుంటారు. ‘రణరంగం’కు అక్కడ మంచి రెస్పాన్సే వచ్చే అవకాశముంది. అయినప్పటికీ ప్రిమియర్లు వద్దని ఎందుకు నిర్ణయించుకున్నారో అర్థం కావడం లేదు.

కొన్నిసార్లు యుఎస్ ప్రిమియర్ల నుంచి నెగెటివ్ టాక్ బయటికి వచ్చి ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల మీద ప్రభావం చూపిస్తుంటుంది. మరి ఆ రకమైన భయంతో ఏమైనా ప్రిమియర్లు రద్దు చేశారా అన్నది అర్థం కావడం లేదు. ప్రిమియర్లు వద్దన్న నిర్ణయం ఆ రకమైన సంకేతాలే ఇస్తోంది మరి. మరి చిత్ర బృందం ఉద్దేశం ఏంటో తెలియాల్సి ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English