దిల్‌ రాజుని వన్‌ ఇయర్‌ వెయిటింగ్‌లో పెట్టాడు

దిల్‌ రాజుని వన్‌ ఇయర్‌ వెయిటింగ్‌లో పెట్టాడు

మీడియం రేంజ్‌ సినిమాలని సోలోగా నిర్మించే దిల్‌ రాజుకి భారీ చిత్రాలు మాత్రం వేరే వాళ్లతో కలిసి చేయాల్సి వస్తోంది. మహర్షిని అయిష్టంగానే మరో ఇద్దరితో కలిసి నిర్మించిన దిల్‌ రాజు 'సరిలేరు నీకెవ్వరు'కి కూడా ఆ పరిస్థితిని అవాయిడ్‌ చేయలేకపోయాడు. అందుకే అల్లు అర్జున్‌తో అర్జంటుగా ఒక భారీ చిత్రాన్ని ప్లాన్‌ చేసాడు.

సుకుమార్‌ కథ రాయడానికి టైమ్‌ తీసుకుంటున్నాడని మధ్యలో తన ఐకాన్‌ పూర్తి చేయించేయాలని అనుకున్నాడు. కానీ సుకుమార్‌ త్వరగా కథ పూర్తి చేసేసి అల్లు అర్జున్‌ సమ్మతం కూడా పొందాడు. ఆ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో వుంటుంది. దీని కోసం అల్లు అర్జున్‌ ఒక గెటప్‌ కూడా వేయబోతున్నాడు. ఈ చిత్రం పూర్తి కావడానికి కనీసం ఏడాది సమయం అవసరమవుతుంది.

సుకుమార్‌ ఏ చిత్రాన్నీ వేగంగా పూర్తి చేయాలనుకోడు. అతనికి హీరోలు కూడా తగినంత సమయం ఇస్తూ వుంటారు. కనుక ఈ భారీ చిత్రం కోసం దిల్‌ రాజు ఏడాది కాలం వేచి చూడక తప్పదు. అయితే ఈలోగా వేరే స్టార్‌ హీరో డేట్స్‌ తీసుకోవాలని దిల్‌ రాజు ట్రై చేస్తున్నాడు. కానీ ప్రస్తుతం టాప్‌ హీరోలందరూ ఏదో ఒక ప్రాజెక్ట్‌తో బిజీగా వున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English