ఆ సినిమా భవిష్యత్తు మన్మథుడిపైనే

ఆ సినిమా భవిష్యత్తు మన్మథుడిపైనే

మన్మథుడు 2కి ముందు సోలో సినిమాలు మానేయాలని నాగార్జున డిసైడ్‌ అయ్యాడు. ఆఫీసర్‌ చిత్రానికి జరిగిన పరాభవం నుంచి కోలుకోవడానికి ఆయనకు చాలా సమయం పట్టింది. దేవదాస్‌లో నానితో కలిసి నటించినా కానీ అది అంతగా సక్సెస్‌ అవలేదు. ఈలోగా కాస్త బోల్డ్‌ క్యారెక్టరైజేషన్‌ వున్న మన్మథుడు 2 చేయాలని నాగార్జున డిసైడయ్యాడు.

ఒక ఫ్రెంచి సినిమా ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో నాగార్జున స్త్రీలోలుడిగా కనిపిస్తాడు. ఇప్పటికే ఈ పాత్ర పోషించడం పట్ల చాలా విమర్శలు వస్తున్నా కానీ ఈ జనరేషన్‌ ఆడియన్స్‌ దీనిని ఆదరిస్తారనే నమ్మకాన్ని నాగ్‌ వ్యక్తం చేస్తున్నాడు.

ఇదిలావుంటే నాగ్‌తో బంగార్రాజు చేయడానికి 'సోగ్గాడే చిన్నినాయనా' దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ ఒక కథ కూడా సిద్ధం చేసుకున్నాడు. దీనికి మల్టీస్టారర్‌ టచ్‌ ఇవ్వడం కోసం నాగచైతన్యకి లెంగ్తీ క్యారెక్టర్‌ కూడా డిజైన్‌ చేసారు. అయితే మన్మథుడు చిత్రానికి వచ్చే ఆదరణని బట్టి ఇది చేయాలా వద్దా అని నాగార్జున డిసైడ్‌ అవుతారట. సోగ్గాడేలో బంగార్రాజు పాత్ర కాస్త అడల్ట్‌ హ్యూమర్‌ పండిస్తుంది.

మన్మథుడు 2లో నాగార్జున పాత్రని జనం యాక్సెప్ట్‌ చేస్తే ఆ డోసుని బంగార్రాజులో పెంచాలని చూస్తున్నారు. అలా ఆ చిత్రానికి ట్రెండీ లుక్‌ వస్తుందని, సోగ్గాడే క్రేజ్‌ కూడా జత కలిస్తే బాక్సాఫీస్‌ వద్ద కూడా వర్కవుట్‌ అవుతుందని అంచనా వేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English