‘మహా’ అద్భుతం తర్వాత ఏం తీయబోతున్నాడు?

‘మహా’ అద్భుతం తర్వాత ఏం తీయబోతున్నాడు?

రాశి కంటే వాసి ముఖ్యం అంటుంటారు పెద్దోళ్లు. సినీ పరిశ్రమలో ఇది మరీ ముఖ్యం. ఎన్ని సినిమాలు తీశామనేదాని కంటే అందులో మంచివి, ప్రేక్షకుల మెప్పు పొందినవి ఎన్ని అనేది కీలకం. చాలా తక్కువ చిత్రాలతోనే గొప్ప స్థాయి అందుకుని, ప్రేక్షకుల గౌరవాన్ని సంపాదించిన దర్శకులు కొందరు కనిపిస్తారిక్కడ. నాగ్ అశ్విన్ అనే యువ దర్శకుడు ఈ కోవకే చెందుతాడు. అతను తీసిన రెండే రెండు సినిమాలు. వాటితోనే అతను లెజెండరీ స్టేటస్ సంపాదించాడంటే అతిశయోక్తి కాదు.

తొలి సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’తోనే అతను తన పరిణతిని, ప్రత్యేకతను చాటాడు. ఇక ‘మహానటి’తో అయితే ఒకేసారి చాలా మెట్లు ఎక్కేశాడు. తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమా అది. విమర్శకుల నుంచి గొప్ప ప్రశంసలు అందుకోవడమే కాదు.. ప్రేక్షకాదరణను కూుడా గొప్ప స్థాయిలో అందుకుందీ చిత్రం.

ఐతే దీని తర్వాత నాగ్ అశ్విన్ ఏం సినిమా తీస్తాడా అని ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అతడితో సినిమా చేయడానికి టాప్ హీరోలు, నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. కానీ అతనేమీ తొందరపడలేదు. ‘మహానటి’ రిలీజై 15 నెలలు దాటినా కొత్త సినిమా ఊసే చెప్పలేదు. ఐతే ఎట్టకేలకు అతడి నుంచి రాబోయే తర్వాతి సినిమా గురించి అప్ డేట్ బయటికి వచ్చింది. ‘మహానటి’కి దీటుగా అశ్విన్‌తో మరో ప్రెస్టీజియస్ మూవీ తీయడానికి వైజయంతీ మూవీస్ సిద్ధమవుతోంది.

ఈ సినిమాకు పని చేసేందుకు విజువల్ ఆర్టిస్టులు, రచయితలకు ఆహ్వానం పలుకుతూ ట్విట్టర్లో ఒక అప్పీల్ ఇచ్చింది వైజయంతీ మూవీస్. అందులో అశ్విన్ తీయబోయేది భారీ, ప్రెస్టీజియస్ మూవీ అనే సంకేాతాలు ఇచ్చింది. మరి అంత ప్రతిష్టాత్మకంగా తీయబోతున్న కథేంటి.. అందులో నటించే ఆర్టిస్టులెవరు అన్నది ఆసక్తికరం. త్వరలోనే ఆ విశేషాలు బయటికి రాబోతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English