వాట్ అమ్మా.. వాట్ ఈజ్ నెక్స్ట్ అమ్మా

వాట్ అమ్మా.. వాట్ ఈజ్ నెక్స్ట్ అమ్మా

హీరోయిన్లు చాలామంది కెరీర్ దాదాపు క్లోజ్ అయ్యే దశలో పెళ్లి చేసుకుంటారు. ఒకవేళ కొంచెం కెరీర్ ఉండగానే పెళ్లి చేసుకున్నా.. ఆ తర్వాత దాదాపుగా అవకాశాలు ఆగిపోతుంటాయి. కొంచెం గ్యాప్ తీసుకుని వదిన, అక్క పాత్రలకు రెడీ అయిపోతుంటారు. కానీ సమంత మాత్రం ఇందుకు భిన్నం. పెళ్లి తర్వాత ఆమె కెరీర్ జోరు తగ్గడం కాదు.. ఇంకా పెరిగింది. అంతకుముందెన్నడూ చేయని గొప్ప పాత్రలు ఆమెను వరించాయి. వరుస హిట్లతో దూసుకెళ్లిపోతోంది సామ్.

కొత్తగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ సత్తా చాటుతోంది. తాజాగా ‘ఓ బేబీ’ సినిమా సమంతకు ఎంత మంచి పేరు తెచ్చిందో.. ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. దీంతో సామ్‌పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

దీంతో సమంత చేయబోయే తర్వాతి సినిమా ఏదన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఐతే పెళ్లయిన కొత్తలో మినహాయిస్తే కెరీర్లో ఎన్నడూ పెద్దగా గ్యాప్ తీసుకోని సమంత.. ఇప్పుడు మాత్రం వెయిట్ అండ్ సీ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఒక సినిమా చేస్తుండగానే ఇంకా ఒకట్రెండు సినిమాలు లైన్లో పెడుతూ వచ్చిన సమంత.. ‘ఓ బేబీ’ తర్వాత మాత్రం ఏ సినిమా ఒప్పుకోలేదు. అభిమానులు సోషల్ మీడియాలో ఆమెను అదే పనిగా తర్వాతి సినిమా గురించి ప్రశ్నిస్తున్నా స్పందించడం లేదు సామ్.

పెళ్లి తర్వాత గ్లామర్ క్యారెక్టర్లు చేసే పరిస్థితి లేకపోవడం, వేరే హీరోలతో రొమాన్స్ చేయడం కూడా ఇబ్బందిగా మారడంతో పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌కే ప్రాధాన్యం ఇస్తోంది సామ్. కానీ హీరోయిన్లకు అలాంటి రోల్స్ తరచుగా దొరకవు. కానీ సామ్ రాజీ పడకుండా తన ప్రత్యేకత చాటుకునే సినిమా కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. ఆమె మళ్లీ ఓ రీమేక్ సినిమా చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది కానీ.. దాని గురించి అఫీషియల్ న్యూస్ ఏదీ బయటికి రాలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English