సరిలేరు నీకెవ్వరు... అనేలా ఇరగదీస్తున్నాడు

సరిలేరు నీకెవ్వరు... అనేలా ఇరగదీస్తున్నాడు

దేవిశ్రీప్రసాద్‌ మ్యూజిక్‌కి ఇటీవల క్రిటిసిజమ్‌ పెరిగింది. అన్ని సినిమాల్లో అవే ట్యూన్లు మార్చి మార్చి కొడుతున్నాడని, అతని మ్యూజిక్‌ స్టేల్‌ అయిపోయిందని విమర్శలు వచ్చాయి. దీంతో దేవిశ్రీప్రసాద్‌ చాలా ప్రాజెక్టులు కాన్సిల్‌ చేసుకున్నాడు.

ఇకపై సెలక్టివ్‌గా కొద్ది సినిమాలు మాత్రమే చేయాలని డిసైడ్‌ అయ్యాడు. ఈమధ్య మహేష్‌కి బాగా క్లోజ్‌ అయిన దేవి 'సరిలేరు నీకెవ్వరు'కి మాత్రం మహేష్‌ కెరియర్‌లోనే ఉత్తమ ఆల్బమ్‌ ఇచ్చేలా కసిగా పని చేస్తున్నాడు. దేవి ట్యూన్లు విన్నవారు ఇరగదీస్తున్నాడని కితాబులు ఇస్తున్నారు.

ఈ చిత్రంలో రెండు అదిరిపోయే మాస్‌ పాటలతో పాటు మహేష్‌ ఇంట్రడక్షన్‌ సాంగ్‌ కూడా పీక్స్‌లో వుంటుందట. ఈ చిత్రం పాటలు పూర్తి చేసే వరకు మరే చిత్రానికి పని చేయనని కూడా దేవి తేల్చి చెప్పేసాడట.

ఇటీవల తనని సంప్రదిస్తోన్న వారు తగ్గడంతో మళ్లీ నంబర్‌వన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిపించుకునేలా రెచ్చిపోయేందుకు దేవి కృషి చేస్తున్నాడు. మహేష్‌ బర్త్‌డేకి విడుదల చేసే ఫస్ట్‌లుక్‌లో దేవి మ్యూజిక్‌ బిట్‌ ఒకటి వినిపిస్తారట. దాంతోనే దీనిపై అంచనాలు తారాస్థాయికి చేరిపోతాయని అంటున్నారు మరి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English