గొడవ ఆపడానికే ప్రభాస్‌ దిగాడు

గొడవ ఆపడానికే ప్రభాస్‌ దిగాడు

సాహో చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్టు ఎనిమిది నెలల క్రితమే ప్రకటించడంతో అందుకు అనుగుణంగా పలువురు నిర్మాతలు తమ రిలీజ్‌లు ప్లాన్‌ చేసుకున్నారు. కానీ సాహో ఆలస్యమై పదిహేను రోజులు వాయిదా పడడంతో చాలా మంది ప్లాన్స్‌ చెడిపోయాయి.

అయితే కొత్త డేట్‌ గురించి కనీసం తమతో సంప్రదించకుండా, ఆల్రెడీ అప్పటికి షెడ్యూల్‌ చేసుకున్న సినిమాల సంగతేమిటని తేల్చుకోకుండా ఆగస్ట్‌ 30న రిలీజ్‌ చేస్తున్నామని చెప్పేసారు. ఇది చాలా మంది నిర్మాతలని బాధించింది.

ఇలా చివరి నిమిషంలో డేట్‌ మార్చుకున్నారు కనుక సాహోనే మరో తేదీకి వెళ్లమని చెప్పాలని, తమని ఇబ్బంది పెట్టకూడదని కొందరు నిర్మాతలు చాంబర్‌కి వెళ్లారట. దాంతో ప్రభాస్‌ రంగంలోకి దిగి అందరికీ సారీ చెప్పి కూల్‌ చేసాడట.

అందుకే తన సినిమా కోసం వాయిదా వేసుకున్న సినిమాల నిర్మాతలు, హీరోలకి ప్రభాస్‌ థాంక్స్‌ చెప్పాడు. ఒకవేళ వాళ్లు రివర్స్‌ అయినట్టయితే సాహో సెప్టెంబర్‌ రెండవ వారానికి వెళ్లాల్సి వచ్చేది. ఈసారి వాయిదా పడకుండా అన్నీ సకాలంలో పూర్తయ్యేలా ప్రభాసే స్వయంగా చూసుకుంటున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English