బిగ్‌బాస్‌: తమన్నా మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌?

బిగ్‌బాస్‌: తమన్నా మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌?

ట్రాన్స్‌జెండర్‌ తమన్నాని బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పంపించడం ద్వారా సంచలనానికి తెర తీసిన బిగ్‌బాస్‌ నిర్వాహకులు తలచింది ఒకటయితే, జరుగుతున్నది మరొకటి. ట్రాన్స్‌జెండర్‌ వుండడం వల్ల షోకి కొత్త డైమెన్షన్‌ వస్తుందని భావించారు కానీ తమన్నా మొత్తం చెత్త చెత్త చేసేసింది.

దీంతో చూసే ప్రేక్షకులతో పాటు హౌస్‌లో వున్న వారికి కూడా నరకప్రాయంగా మారింది. రవికృష్ణని టార్గెట్‌ చేస్తూ నోటికి వచ్చినట్టు దూషిస్తోన్న తమన్నాని ఇంట్లో చాలా మంది సభ్యులు మందలించారు.

ఆల్రెడీ ఈ ఇష్యూ మీద బిగ్‌బాస్‌ కూడా రవికృష్ణ, శ్రీముఖితో మాట్లాడాడు. సోషల్‌ మీడియాలో వస్తోన్న రెస్పాన్స్‌ని బట్టి తమన్నాని మిడ్‌ వీక్‌లో ఎలిమినేట్‌ చేసేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తమన్నాతో వీకెండ్‌లో నాగార్జున ఇంటరాక్ట్‌ అయి ఇంటికి పంపించడం కంటే అసలు ఆమెకి సరయిన సెండ్‌ ఆఫ్‌ లేకుండా హౌస్‌ హార్మనీ దెబ్బతీసి, వ్యక్తిగత దూషణలకి దిగినందుకు గాను డైరెక్ట్‌ ఎలిమినేషన్‌ ఇచ్చేస్తారని బలంగా వినిపిస్తోంది.

అయితే ఈ చర్య వల్ల బిగ్‌బాస్‌ నిర్వాహకులకి తర్వాత తలనొప్పులు వచ్చే అవకాశముంది. తమన్నా తీరు తెలిసిన వారు ఆమె బయటకి వచ్చి చేసే రచ్చ తీవ్రంగా వుంటుందని హెచ్చరిస్తున్నారు. తమన్నా మాత్రం బిగ్‌బాస్‌ తెలుగు షోలో ఇంతవరకు ఇంత వరస్ట్‌ క్యాండిడేట్‌ రాలేదనే ఫీలింగ్‌ తెచ్చి సోషల్‌ మీడియాలో అందరితో తిట్లు తింటోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English