ఆ మన్మథుడి ముందు ఇది తుస్‌!

ఆ మన్మథుడి ముందు ఇది తుస్‌!

మన్మథుడు సినిమా పేరు చెప్పగానే గుర్తొచ్చేది త్రివిక్రమ్‌ మాటలు, దేవిశ్రీప్రసాద్‌ పాటలు. 'నా మనసునే మీటకే', 'నేను నేనుగా లేనే', 'గుండెల్లో ఏముందో' లాంటి ఎవర్‌గ్రీన్‌ మెలోడీ పాటలని దేవిశ్రీప్రసాద్‌ అందించాడు.

ఆ చిత్రానికి సీక్వెల్‌ అని పేరు పెట్టుకున్నందుకు 'మన్మథుడు 2' ఆడియో కనీసం అందులో సగమైనా వుండాలని అనుకోవాలిగా. చైతన్‌ భరద్వాజ్‌ స్వరపరిచిన ఈ ఆల్బమ్‌లో మూడంటే మూడే పాటలున్నాయి.

వీటిలో ఏదీ ఆ మన్మథుడులో పాటకి సాటి రాగలది ఒక్కటీ లేదు. ఇటీవల తెలుగు సినిమాల్లో పాటల ప్రాధాన్యం తగ్గింది కానీ ఒక సినిమా బ్రాండ్‌ కంటిన్యూ చేస్తున్నపుడు అందుకు తగ్గ రేంజ్‌ మెయింటైన్‌ చేయాలిగా. ఈ చిత్రం మ్యూజిక్‌ విషయంలో నాగ్‌ ఎందుకో రాజీ పడిపోయి తక్కువలో వచ్చే సంగీత దర్శకుడిని పెట్టుకున్నాడు.

తీరా ఈ మన్మథుడు 2 పాటలు అంతంతమాత్రంగానే వున్నాయి. ఇక పూర్తిగా సినిమాలోని వినోదం మీదే ఈ చిత్రం ఆధారపడాలి. మన్మథుడు పాటల్ని మ్యాచ్‌ చేయలేకపోయిన ఈ 2 కనీసం ఆ చిత్రంలోని వినోదాన్ని అయినా మ్యాచ్‌ చేస్తుందా లేదా అనేది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English