కాజల్‌ అతికి సెన్సార్‌ బ్రేక్‌

కాజల్‌ అతికి సెన్సార్‌ బ్రేక్‌

హిందీలో కంగన రనౌత్‌ చేసిన క్వీన్‌ చిత్రాన్ని దక్షిణాదిలో మూడు భాషలలో ముగ్గురు హీరోయిన్లతో తెరకెక్కించారు. తెలుగు వెర్షన్‌ తమన్నా చేస్తే, తమిళ వెర్షన్‌లో కాజల్‌ నటించింది. రమేష్‌ అరవింద్‌ దర్శకత్వం వహించిన తమిళ వెర్షన్‌ హిందీ కంటే బోల్డ్‌గా తెరకెక్కింది.

టీజర్‌లో కాజల్‌ బ్రెస్ట్‌ని సాటి నటి ఒత్తడం అప్పట్లో సంచలనమైంది. ఇది టీజర్‌ మాత్రమే సినిమాలో చాలా వుందంటూ ఆ చిత్ర బృందం డప్పు వేసుకుంది. అయితే ఎంత రెచ్చిపోయి సినిమా తీసినా కానీ సెన్సార్‌ అంటూ ఒకటి వుంటుందిగా. వారి ఆమోదం లేకుండా ఏ సినిమా బయటకి రాదుగా.

ఇప్పుడు క్వీన్‌ తమిళ రీమేక్‌ అలాగే సెన్సార్‌ చిక్కుల్లో పడింది. ఏ సర్టిఫికెట్‌ ఇచ్చినా కానీ తమిళ సెన్సిబులిటీస్‌కి ఆమోదించలేనివి ఈ చిత్రంలో చాలా వున్నాయని, అవన్నీ తొలగిస్తే తప్ప క్లియరెన్స్‌ ఇవ్వలేమని చెప్పారట. అయితే ఆ సన్నివేశాలు, సంభాషణలు తొలగిస్తే ఈ చిత్రంలో ఏమీ మిగలదని, జనం ఏమాత్రం ఆసక్తి చూపించరని సెన్సార్‌ వారిని బ్రతిమాలుకుంటున్నారట.

ఈ తంతు తేలితే కానీ ఈ చిత్రం వెలుగు చూడదన్నమాట. అసలే కాజల్‌కి ఇటీవల ఏదీ కలిసి రావడం లేదు. ఆమె నటించిన ప్రతి సినిమా టపా కట్టేస్తోంది. ఇప్పుడు క్వీన్‌ అయితే రిలీజ్‌ అవుతుందో లేదో తెలియని స్థితిలో వుంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English