రవితేజ 'డిస్కో రాజా'కి కూసాలు కదిలాయి!

రవితేజ 'డిస్కో రాజా'కి కూసాలు కదిలాయి!

వరుస పరాజయాలతో డీలా పడ్డ రవితేజ 'డిస్కోరాజా'కి కాన్సెప్ట్‌ బేస్డ్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం రవితేజ చాలా రాజీ పడ్డాడు. వి.ఐ. ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రవితేజ చాలా కాలం తర్వాత కోమా నుంచి బయటకి వచ్చే వ్యక్తి పాత్ర పోషిస్తున్నాడు.

కోమాలోకి వెళ్లిపోయి సాంకేతికంగా చాలా మార్పులు చోటు చేసుకున్న తర్వాత నిద్ర లేచిన హీరో ఒకేసారి ఆ ఆధునికతకి అడ్జస్ట్‌ అవలేని పరిస్థితుల్లో తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడనేది 'డిస్కో రాజా' స్టోరీ. జయం రవి నటిస్తోన్న తమిళ చిత్రం 'కోమాలి' కూడా ఇదే కాన్సెప్ట్‌తో రూపొందుతోంది.

అయితే తమిళంలో పూర్తి స్థాయి కామెడీ చిత్రంగా దీనిని రూపొందించారు. రజనీకాంత్‌పై వేసిన సెటైర్‌తో ఈ చిత్రం టీజర్‌ వైరల్‌ అయింది. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌ కావడంతో ఈ చిత్రాన్ని తెలుగులోకి కూడా అనువదించాలని పలువురు ట్రై చేస్తున్నారు.

అదే జరిగితే 'డిస్కో రాజా' కాన్సెప్ట్‌లోని కొత్తదనం మన ప్రేక్షకులు ఫీలయ్యే అవకాశముండదు. డిసెంబర్‌ వరకు డిస్కోరాజా రాదు కనుక అంతవరకు కోమాలి తెలుగులోకి రాదని, వచ్చినా ఆదరణకి నోచుకోదని ఆశించడం తప్ప చేసేదేమీ లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English