బిగ్‌బాస్‌... బాబోయ్‌ భాస్కర్‌!

బిగ్‌బాస్‌... బాబోయ్‌ భాస్కర్‌!

బిగ్‌బాస్‌ హౌస్‌లో అతి మంచితనం జనాలకి దగ్గర చేస్తుందా? మామూలుగా అయితే అలాంటోళ్లని జనం ఇష్టపడరు. కానీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో ప్రకాష్‌రాజ్‌ని తలపించే మంచితనంతో ఈ సీజన్‌పై తనదైన ముద్ర వేస్తోన్న కొరియోగ్రాఫర్‌ బాబా భాస్కర్‌కి విపరీతంగా ఓట్లు గుద్దుతున్నారు.

మూడు వారాలలో తొలిసారిగా నామినేషన్లలోకి వచ్చిన బాబా భాస్కర్‌ మిగతా కంటెస్టెంట్లు బాబోయ్‌ అనుకునే లెవల్లో ఓట్లు రాబడుతున్నాడు.

అనఫీషియల్‌ పోల్స్‌ అన్నిటిలోను అరవై శాతానికి పైగా ఓట్లతో బాబా డామినేట్‌ చేస్తున్నాడు. ఇంతవరకు బాబాపై నెగెటివ్‌ ఇంప్రెషన్‌ రాకపోవడం, అతని ప్రవర్తన నిజంగానే అంత మంచివాడనే ఫీలింగ్‌ తేవడం బాబాకి ప్లస్‌ అవుతోంది. అయితే అతను నిజంగానే అంత మంచివాడా, ఫ్లాస్‌ లేవా అంటే పదే పదే యాంటీ వరుణ్‌ సందేశ్‌ గ్రూప్‌తో కలిసి డిస్కషన్లు చేస్తుంటాడు.

అవతలి గ్రూప్‌పై చేసే కామెంట్స్‌ని బాగా ఎంజాయ్‌ చేస్తుంటాడు. కాకపోతే తనంతట తానుగా ఏమీ అనడు. గొడవలకి కూడా వెళ్లడు. దీని వల్ల అతని తప్పులు ఓవర్‌లుక్‌ అవుతున్నాయి.

హౌస్‌మేట్స్‌ మూకుమ్మడిగా ఈసారికి యాభై లక్షలు అతనికే ఇచ్చేయాలని డిసైడ్‌ అయిపోతే ఏమీ చేయలేరు కానీ అతడిని ఎక్స్‌పోజ్‌ చేయాలని నడుం కడితే బాబా పాపులారిటీ ఏమైనా తగ్గుతుందేమో మరి. ఇప్పటికి అయితే టైటిల్‌ విన్నర్‌ కావడానికి బాబాకి గట్టి ఛాన్స్‌ వుందనే అనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English