నాగార్జున పంట పండినట్టే

నాగార్జున పంట పండినట్టే

'సాహో' ఆగస్ట్‌ 30కి వాయిదా పడడంతో అంతవరకు ఈ నెలలో వచ్చే ఏకైక భారీ చిత్రం మన్మథుడు 2 ఒక్కటే. ఈ చిత్రాన్ని ఇరవై ఒక్క కోట్లకి విక్రయించగా, తొలి వారంలో పలు సెలవు దినాలు రావడం ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌ కానుంది.

9న వరలక్ష్మీ వ్రతం సందర్భంగా కొందరికి సెలవు వుంటుంది. అలాగే 12న బక్రీద్‌ పేరిట మరో హాలిడే వుంది. ఇక ఆగస్ట్‌ 15 అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్‌ కానుంది. ఆ రోజున రణరంగం, ఎవరు రిలీజ్‌ అవుతున్నాయి కానీ మన్మథుడు 2 కనుక మంచి టాక్‌ తెచ్చుకుంటే ఆ రోజుని ఫుల్‌గా క్యాష్‌ చేసుకునే వీలుంటుంది.

సాహో కనుక ముందుగా అనుకున్నట్టు ఆగస్ట్‌ 15న వచ్చినట్టయితే మన్మథుడు 2కి సమస్యగా మారేది. కానీ ఇప్పుడు ఇదొక్కటే ఫ్యామిలీ సినిమాలా కనిపిస్తోంది కనుక హాలిడేస్‌ని బాగా సొమ్ము చేసుకోవడానికి అవకాశముంటుంది. నాగార్జునకి ఇటీవలి కాలంలో సరయిన హిట్‌ లేదు.

ఆఫీసర్‌ అయితే కోటి రూపాయల కంటే తక్కువ షేర్‌తో నాగార్జున పరువు తీసింది. ఆ పరాభవాన్ని మరిపించి, మరోసారి బాక్సాఫీస్‌పై సోగ్గాడిలా వీరవిహారం చేయడానికి ఇంతకంటే మంచి ఛాన్స్‌ రాదు మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English