పూరీకి అంతకంటే ఆప్షన్‌ లేదు

పూరీకి అంతకంటే ఆప్షన్‌ లేదు

పూరి జగన్నాధ్‌ బ్లాక్‌బస్టర్‌ అయితే ఇచ్చాడు కానీ ఇండస్ట్రీ నమ్మకాన్ని మాత్రం తిరిగి సాధించలేకపోయాడు. మరో హిట్‌ కూడా ఇస్తే కానీ పూరి పూర్తిగా ఫామ్‌లోకి వచ్చాడని నమ్మేలా లేరు. ఇస్మార్ట్‌ శంకర్‌తో ఈ ఏడాదిలో వచ్చిన అతి పెద్ద హిట్‌ సినిమాల్లో ఒకటి అందించిన పూరి జగన్నాధ్‌కి హీరో దొరకడం లేదు.

కాస్త పేరున్న హీరోలంతా పూరీతో పని చేయడానికి ఇది తగిన సమయం కాదని భావిస్తున్నారు. ఇస్మార్ట్‌ ఏదో సుడి కొద్దీ విజయం సాధించినా కానీ మళ్లీ పూరి చిత్రానికి జనం అలాగే బారులు తీరతారనే గ్యారెంటీ లేదంటున్నారు. స్టార్‌ హీరోలు కాకపోయినా కనీసం టయర్‌ 2 హీరోలు అయినా తన కోసం క్యూ కడతారని భావించిన పూరికి కూడా పరిణామం అర్థం కావడం లేదు.

దీంతో ఇప్పుడు పూరి దగ్గర ఒకటే ఆప్షన్‌ వుందంటున్నారు. పైసా వసూల్‌ ఫ్లాప్‌ అయినా కానీ పూరితో పని చేయడాన్ని చాలా లైక్‌ చేసిన బాలకృష్ణ మళ్లీ అతని డైరెక్షన్‌లో చేయడానికి సిద్ధమన్నాడు.

బాలయ్యకి ఇప్పుడు వేరే సినిమాలున్నా కానీ తాను కథ చెబితే కాదనడని పూరి భావిస్తున్నాడు. ప్రస్తుతం బాలయ్యతో ఒక మాస్‌ సినిమా సిద్ధం చేయడం మినహా పూరికి మరో ఆప్షన్‌ లేదిప్పుడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English