అతడినిక నాని గట్టెక్కించాలి!

అతడినిక నాని గట్టెక్కించాలి!

ఆర్‌ఎక్స్‌ 100తో హీరోగా సక్సెస్‌ అందుకున్న కార్తికేయ ఆ తర్వాత తన సినిమాల గురించి ఎక్కువ మాట్లాడడం మొదలు పెట్టాడు. హిప్పీ చిత్రానికి నామమాత్రపు వసూళ్లు కూడా రాలేదు.

గుణ 369 మాస్‌ సినిమా కావడంతో దీనికి వసూళ్లు హిప్పీ కంటే బాగానే వస్తున్నాయి కానీ అతను ఎక్సయిట్‌ అయినంతగా కలక్షన్స్‌ అయితే లేవు. ఒక మంచి విజయం దక్కగానే దానిని క్యాష్‌ చేసుకునే తెలివి అందరికీ వుండదు.

ఎలాంటి సినిమా చేస్తే ఆ సక్సెస్‌ కొనసాగుతుందో, ఏ విధంగా తమ స్థానం పదిలమవుతుందో అంచనా వేసుకోవడంలోనే హీరో భవిష్యత్తు ఆధారపడుతుంది. ఆర్‌ఎక్స్‌ 100తో వచ్చినది ఏదైనా వుంటే అదిప్పుడు పూర్తిగా ఆవిరైపోయిన దశలో కార్తికేయ ఇక నాని సినిమాలో చేసిన విలన్‌ పాత్ర మీదే ఆశలు పెట్టుకున్నాడు.

గ్యాంగ్‌లీడర్‌లో విలన్‌గా నటించడానికి సాహసం చేసిన కార్తికేయ ఈ డెసిషన్‌ తీసుకుని మంచి పనే చేసాడు. ఆర్‌ఎక్స్‌ 100 తర్వాత కాబట్టి ఈ ఛాన్స్‌ వచ్చింది కానీ అదే ఇప్పుడయితే ఇంత పెద్ద సినిమాలో ఇంత మంచి అవకాశం వచ్చేది కాదు.

విలన్‌ పాత్రలు చేసిన తర్వాత గోపిచంద్‌ మాస్‌ హీరోగా ఎన్ని విజయాలు సాధించాడో తెలిసిందే కనుక కార్తికేయ ఈ అవకాశాన్ని అయినా సద్వినియోగం చేసుకుని కెరియర్‌ బిల్డ్‌ చేసుకోవాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English