ఇస్మార్ట్‌ రామ్‌ రేంజ్‌కి అది సరిపోదంట!

ఇస్మార్ట్‌ రామ్‌ రేంజ్‌కి అది సరిపోదంట!

ఇస్మార్ట్‌ శంకర్‌తో రామ్‌కి మాస్‌లో పెనిట్రేషన్‌ దొరికింది. చాలా కాలంగా మాస్‌ హీరో కావాలనే కోరికని ఈ చిత్రం కొంతవరకు తీర్చింది. అయితే ఈ చిత్రంతో తనకి ఫాన్‌ క్లబ్‌లు ఏర్పడతాయా, ప్రతి సినిమాకీ ఇలాగే వసూళ్లు వస్తాయా అనేది ఇప్పుడే చెప్పడం కష్టం. కానీ రామ్‌ మాత్రం ఈ సక్సెస్‌ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలని చూస్తున్నాడు.

ఈ చిత్రం విడుదల కాకముందు రామ్‌కి దీనిపై పెద్దగా హోప్స్‌ అయితే లేవు. అందుకే తన కెరియర్‌లోనే అతి పెద్ద విజయాన్ని జనం మధ్య ఎంజాయ్‌ చేయకుండా విదేశీ టూర్‌ వెళ్లిపోయాడు. ఈ చిత్రం ఫ్లాప్‌ అయితే కనుక బ్యాకప్‌గా 'తడమ్‌' అనే చిత్రాన్ని రీమేక్‌ చేయాలని అనుకున్నాడు. నేను శైలజ తీసిన కిషోర్‌ తిరుమలకి ఆ బాధ్యతలు అప్పగించాడు. తన పెదనాన్న రవికిషోర్‌ తడమ్‌ రీమేక్‌ రైట్స్‌ తీసుకుని తెలుగు స్క్రిప్ట్‌ రెడీ చేయించాడు.

కానీ ఇస్మార్ట్‌ విజయం తర్వాత రామ్‌ మనసు మార్చుకున్నాడు. తనకిప్పుడు మాస్‌ కథ కావాలని, ఇన్నోవేటివ్‌ సినిమాలంటూ ఇప్పుడొచ్చిన ఇమేజ్‌ని వృధా చేసుకోలేనని అంటున్నాడు. కానీ ఇప్పుడు నమ్మదగ్గ మాస్‌ సినిమాలు చేస్తోన్న దర్శకులెవరు? కాస్త లేట్‌ అయినా ఫర్వాలేదు కానీ మాస్‌ కథ దొరికే వరకు అన్వేషించాలని రామ్‌ డిసైడ్‌ అయిపోయాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English