పవన్‌తో ఆ అనుభవం.. త్రివిక్రమ్‌ నుంచి ఆ ప్రామిస్

పవన్‌తో ఆ అనుభవం.. త్రివిక్రమ్‌ నుంచి ఆ ప్రామిస్

తెలుగు సినిమా పరిశ్రమలో చాలా క్లోజ్ ఫ్రెండ్స్‌గా పేరున్న పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌లతో తన అనుభవాల గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు యువ కథానాయకుడు శర్వానంద్. తన కొత్త సినిమా ‘రణరంగం’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా వీళ్లిద్దరి గురించి అతను మాట్లాడాడు.

పవన్ కళ్యాణ్‌తో కలిసి నిన్న శర్వా తీసుకున్న ఒక సెల్ఫీ నిన్న సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. ‘రణరంగం’ ఈవెంట్ కోసం కాకినాడ వెళ్లే  క్రమంలో ఎయిర్ పోర్ట్ దగ్గర అనుకోకుండా పవన్‌ను కలిశాడట శర్వా. ఈ సందర్భంగా పవన్ చాలా ఆప్యాయంగా పలకరించి మాట్లాడినట్లు శర్వా తెలిపాడు.

తాను సినిమాల్లోకి రావడానికి ముందు పవన్ సినిమా షూటింగులకు వెళ్లేవాడినని.. వరుసగా మూడు రోజుల పాటు ఆయన షూటింగుకి వెళ్లడంతో పిలిచి మాట్లాడాడని శర్వా గుర్తు చేసుకున్నాడు. ఆ విషయాన్ని ఎయిర్ పోర్ట్‌లో మాట్లాడేటపుడు పవన్ గుర్తు చేయడం తనకు నోస్టాల్జిక్‌గా అనిపించిందని శర్వా చెప్పాడు.

పవన్ తమతో కలిసి ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించడం, చాలా సింపుల్‌గా ఉండటం చూసి హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ ఆశ్చర్యపోయిందని.. పవన్ కళ్యాణ్ అంటే అదే అని.. జనాల కోసం ఆయన అలా సామాన్యుడిలా తయారయ్యాడని శర్వా అన్నాడు.

మరోవైపు త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూ.. ఆయన దర్శకుడు కాకముందే, రచయితగా ఉన్నపుడు వేషాల కోసం తన దగ్గరికి వెళ్లేవాడినని.. తన కోసం ఏదైనా క్యారెక్టర్ రోల్ ఉన్నా చెప్పమని అడిగానని.. కానీ తనతో హీరోగానే సినిమా చేస్తానని.. అది కాక వేరే పాత్ర ఇవ్వనని త్రివిక్రమ్ చెప్పాడని.. అప్పుడు ఆయనలా ఎందుకన్నారో తెలియదని శర్వా చెప్పాడు. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English