‘సైరా’ రిలీజ్‌పై డౌట్లు క్లియర్

‘సైరా’ రిలీజ్‌పై డౌట్లు క్లియర్

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ ఇప్పటికే రెండుమూడుసార్లు వాయిదా పడింది. చివరికి అక్టోబరు 2కు రిలీజ్ డేట్ ఖరారైనట్లు భావించారంతా. కానీ ఈ సినిమా ఆ డేట్‌ను కూడా అందుకోవడం కష్టమే అని.. వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా పడనుందని ఈ మధ్య వార్తలొచ్చాయి. దీనిపై చిత్ర బృందం ఇప్పటిదాకా ఏమీ స్పందించలేదు.

దీంతో మెగా అభిమానుల్లో ఆందోళన మొదలైంది. సంక్రాంతికి ఆల్రెడీ గట్టి పోటీ ఉండటంతో ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆందోళన చెందుుతుున్నాయి. ‘సైరా’ సంక్రాంతికే ఖరారైతే మొత్తం గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయి. మరి ‘సైరా’ పక్కాగా ఎప్పుడు విడుదలవుతుందనే విషయంలో అయోమయం కొనసాగుతోంది.

ఐతే ఈ అయోమయానికి మెగాస్టార్ స్వయంగా తెరదించాడు. తన నోటితోనే ‘సైరా’ రిలీజ్ డేట్ చెప్పాడు చిరు. అక్టోబరు 2నే ‘సైరా’ విడుదల కానున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తాజాగా తన కోడలు ఉపాసనతో కలిసి ఒక మ్యాగజైన్ కోసం ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు చిరు. అందులో ఉపాసనే ఆయన్ని ఇంటర్వ్యూ చేసింది. అందులో ‘సైరా’ గురించి మాట్లాడాడు చిరు. ‘‘అక్టోబర్‌ 2వ తేదీన మహాత్మా గాంధీ 150వ జన్మదినం సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయటం ఒక గొప్ప అనుభూతి’’ అని చిరు పేర్కొనడంతో ఈ సినిమా రిలీజ్ విషయంలో సందిగ్ధతకు తెరపడినట్లే.

ఓ మహోన్నతమైన సినిమాలో నటించినప్పుడు ఏ నటుడికైనా చాలా ఆనందంగా ఉంటుందని.. ‘సైరా’ చేశాక తన అనుభూతి కూడా అదే అని చిరు చెప్పాడు. ఇది యువతకు చాలా ముఖ్యమైన సినిమా అని.. సినిమా చూశాక యువతరం దేశభక్తి పట్ల దృష్టి ఆకర్షితులైనా, తమ స్వేచ్ఛను గౌరవించుకోవాలన్న ఆలోచన కలిగినా ‘సైరా’ విజయవంతమైనట్లే అని చిరు అన్నాడు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English