మహేష్ అతడిని కలిశాడేంటబ్బా?

మహేష్ అతడిని కలిశాడేంటబ్బా?

‘ఇస్మార్ట్ శంకర్’ విడుదలకు ముందు యూరప్ పర్యటనకు వెళ్లి.. రెండు రోజుల కిందటే హైదరాబాద్‌కు వచ్చాడు రామ్. రాగానే ‘ఇస్మార్ట్ శంకర్’ ప్రమోషన్లలో బిజీ అయిపోయాడు. ఒక ప్రెస్ మీట్లో కూడా పాల్గొన్నాడు. మరోవైపు మహేష్ బాబు చూస్తే ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్‌లో బిజీగా ఉన్నట్లు వార్తలొచ్చాయి.

కానీ ఈ ఇద్దరూ కలిసి ఒక చోట ముచ్చటిస్తూ కనిపించడం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ సక్సెస్ ప్రెస్ మీట్‌కు హాజరైన డ్రెస్సులోనే మహేష్‌ను కలిసి ముచ్చటిస్తూ కనిపించాడు. మరి ఇద్దరూ ఎక్కడ ఏ సందర్భంలో కలిశారు.. ఏం మాట్లాడుకుంటున్నారు అన్నది చర్చనీయాంశంగా మారింది.

మామూలుగా అయితే వీరి కలయిక గురించి మరీ ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ ‘ఇస్మార్ట్ శంకర్’ విడుదల అనంతరం మహేష్ గురించి పూరి జగన్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. మహేష్‌తో చేయాలనుకున్న ‘జనగనణమన’ ఏమైందని అడిగితే.. తాను హిట్ల మీద ఉన్నపుడే మహేష్ తనతో సినిమా చేస్తాడంటూ ఒక వివాదాస్పద కామెంట్ చేశాడు పూరి.

దీనిపై మహేష్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఆపై ఇదే విషయంపై మీడియా వాళ్లు స్పందించమంటే ‘ఇంకా దీన్ని పెద్ద పెంట చేయాలనుకోవట్లేదు’ అంటూ మాట దాటవేశాడు పూరి. అక్కడ కట్ చేస్తే.. ‘ఇస్మార్ట్ శంకర్’ ఈవెంట్లో పాల్గొన్న సమయంలోనే రామ్.. వెంటనే మహేష్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరి వీరి చర్చల్లో పూరి గురించి డిస్కషన్ వచ్చిందో లేదో?


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English