చిరు లుక్ అదిరిందిగా..

చిరు లుక్ అదిరిందిగా..

మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయాడు. ఒక మ్యాగజైన్ కోసం ఆయన చేసిన ఫొటో షూట్ సంచలనం రేపుతోంది. దాదాపు రెండేళ్లుగా చిరు ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా కోసం జుట్టు, గడ్డం పెంచి.. బరువు కూడా పెరిగి కొంచెం చిత్రంగా తయారయ్యాడు. ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజుల కిందటే పూర్తవడంతో ఆయన లుక్ మార్చుకున్నాడు.

గడ్డం తీసి, బరువు తగ్గేసరికి ఆయన లుక్ మారిపోయింది. చక్కటి కళ్లద్దాలు పెట్టుకుని ఆయన చేసిన తాజా బ్లాక్ అండ్ వైట్ ఫొటో షూట్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఆయన టైమ్ మెషీన్ ఎక్కి రెండు మూడు దశాబ్దాలు వెనక్కి వెళ్లిపోయాడేమో అనిపిస్తోంది. ‘అభిలాష’ సినిమాను గుర్తు చేసే లుక్‌తో చిరు మెస్మరైజ్ చేశాడు. ఈ లుక్ చూసి మెగా అభిమానుల ఆనందం మామూలుగా లేదు.

బి-పాజిటివ్ అనే మ్యాగజైన్ కోసం చిరు ఈ ఫొటో షూట్ చేశాడు. ఇందులో చిరును ఆయన కోడలు ఉపాసన ఇంటర్వ్యూ చేయడం విశేషం. ఇద్దరి ఫొటోలతో ఆ ఇంటర్వ్యూ ప్రసారమైంది. హెల్త్, లైఫ్ స్టైల్ మీద ఈ ఇంటర్వ్యూ సాగింది. ‘సైరా’ తర్వాత చిరు.. కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. దాని కోసం చిరు లుక్ మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ చిత్రంలో చిరు తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తాడని వార్తలొస్తున్నాయి.

కొడుకు పాత్ర కోసం చిరు నాజూగ్గా, యంగ్‌గా తయారయ్యే ప్రయత్నం చేసినట్లున్నాడు. ఈ నెల 22న చిరు పుట్టిన రోజు కానుకగా ఈ చిత్ర ప్రారంభోత్సవం జరగనుంది. సైరా దసరాకు ఖాయం అనుకుంటే.. వచ్చే ఏడాది వేసవికి కొరటాల చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English