ఆర్ఆర్ఆర్ ప్రమోషన్.. అతిగా లేదూ!

ఆర్ఆర్ఆర్ ప్రమోషన్.. అతిగా లేదూ!

ఈ రోజు స్నేహితుల దినోత్సవం. దీన్ని తమ సినిమాల ప్రచారానికి వాడుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. ప్రమోషన్ పెద్దగా అవసరం లేని క్రేజీ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ను సైతం ఈ సందర్భంలో వార్తల్లో నిలిపేందుకు ప్రయత్నిస్తోంది చిత్ర బృందం. #RRRyehdosti అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి మీ స్నేహితుల ఫొటోలు పెట్టండంటూ అభిమానులకు పిలుపు ఇచ్చారు.

ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు, కొమరం భీంల స్నేహం గురించి కొన్ని కబుర్లు చెప్పారు. తర్వాత #RRRyehdosti హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్విట్టర్లో జూనియర్ ఎన్టీఆర్, ఫేస్ బుక్‌లో రామ్ చరణ్ మెసేజ్‌లు పెట్టారు. తామిద్దరం కలిసి ఉన్న మంచి ఫొటోలు షేర్ చేశారు. మరోవైపు రాజమౌళి.. తన స్నేహితుడు సాయికొర్రపాటితో స్నేహం గురించి చెబుతూ ఈ హ్యాష్ ట్యాగ్ మీదే ఒక ట్వీట్ వేశాడు.

ఐతే సీతారామరాజు, కొమరం భీమ్ అసలెప్పుడూ కలవనే లేదన్నది చరిత్రకారులు చెబుతున్న మాట. రాజమౌళి వీళ్లిద్దరూ కలిసినట్లుగా ఒక కల్పిత కథను సృష్టించి వెండితెరపై మ్యాజిక్ చేయబోతున్నాడు. ఆ మధ్య ప్రెస్ మీట్లో ఎంత కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా.. ఈ కాన్సెప్ట్ జీర్ణించుకోలేని విధంగానే అనిపించింది. సినిమాలో జక్కన్న ఎలా మెప్పిస్తాడో కానీ.. ఇప్పటికైతే అల్లూరి, కొమరం స్నేహం గురించి జనాలకు అసలు పట్టింపు లేదు. కానీ స్నేహితుల దినోత్సవాన చిత్ర బృందం.. వీళ్లది రియల్ ఫ్రెండ్షిప్ అన్నట్లుగా ప్రొజెక్ట్ చేస్తూ సినిమాను ప్రమోట్ చేస్తుంటే విడ్డూరంగా అనిపిస్తోంది.

ఇక ఏదో సినిమా కోసం కలిశారు కానీ.. తారక్, చరణ్ కూడా వ్యక్తిగతంగా మరీ గొప్ప మిత్రులేమీ కాదు. వీళ్లకు వేర్వేరుగా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. సినిమా కోసం తామిద్దరం వ్యక్తిగతంగా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నట్లుగా ప్రొజెక్ట్ చేసుకోవడం కూడా కొంచెం అతిగానే అనిపిస్తోంది. ఏదైనా సహజంగా అనిపించాలి కానీ.. సినిమా కోసం కృత్రిమంగా ఫీలింగ్ తీసుకువద్దామని చూస్తే జనాలు ఎలా రియాక్టవుతారో కూడా ‘ఆర్ఆర్ఆర్’ టీం కొంచెం చూసుకుంటే బెటర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English