కాన్సెప్ట్ పేలింది.. రీమేక్ చేస్కోవచ్చు

కాన్సెప్ట్ పేలింది.. రీమేక్ చేస్కోవచ్చు

ట్రైలర్ చూడగానే ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని చెప్పే ధీమా అన్ని చిత్రాల విషయంలోనూ కలగదు. కొన్ని సినిమాల ట్రైలర్లు బాగా అనిపించినా.. సినిమా బాగుంటుందన్న నమ్మకమేమీ కలగదు. ట్రైలర్లోనే హిట్టు కళ కనిపించే చిత్రాలు కొన్ని మాత్రమే ఉంటాయి. 'కోమలి' అనే తమిళ సినిమా ట్రైలర్లో అలాంటి కళే కనిపిస్తోంది.

జయం రవి, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రమిది. ఒక టీనేజీ కుర్రాడు అనుకోకుండా ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్తాడు. అతను ఏకంగా 16 ఏళ్ల పాటు కోమాలో ఉండి.. తనతో పాటు చుట్టూ ఉన్న మనుషులు, వాతావరణం పూర్తిగా మారిపోయిన స్థితిలో ఈ ప్రపంచంలోకి వస్తాడు. అప్పుడు అతడికి ఎదురైన అనుభవాలేంటనే కథతో తెరకెక్కిన చిత్రమే 'కోమలి'. ప్రదీప్ రంగనాథన్ అనే దర్శకుడు రూపొందించాడీ చిత్రాన్ని.

తాజాగా 'కోమలి' ట్రైలర్ లాంచ్ చేశారు. రెండు నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ ట్రైలర్ భలే హిలేరియస్‌గా సాగి సినిమాపై విపరీతమైన ఆసక్తిని కలిగిస్తోంది. టీనేజీలో ఉండగా కోమాలోకి వెళ్లి.. గుబురు గడ్డం, మీసాలతో తనకు తానే కొత్తగా అనిపించే స్థితిలో నిద్ర లేచిన హీరో.. మారిన ప్రపంచంలో ప్రతి దానికీ షాకయ్యే క్రమంలో వచ్చే సన్నివేశాలు ట్రైలర్లోనే భలేగా అనిపిస్తున్నాయి.

కాజల్ చాలా సెక్సీ అవతారంలో కనిపించి అభిమానుల్ని అలరించింది. ట్రైలర్ చివర్లో సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ మీద వేసిన పంచ్ హైలైట్‌గా నిలిచింది. కాజల్ ఉంది కాబట్టి ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువాదం చేస్తారో ఏమో తెలియదు కానీ.. అలా కాని పక్షంలో రీమేక్ చేసుకుని హిట్ కొట్టడానికి అవకాశమున్న హిలేరియస్ కాన్సెప్టే ఇది. తమిళంలో ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English