వావ్.. ఆ తమిళ థ్రిల్లర్ రీమేక్‌లో ఆమిర్ ఖాన్

వావ్.. ఆ తమిళ థ్రిల్లర్ రీమేక్‌లో ఆమిర్ ఖాన్

దక్షిణాదిన గత దశాబ్ద కాలంలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటిగా ‘విక్రమ్ వేద’ను చెప్పొచ్చు. భార్యాభర్తలైన పుష్కర్ గాయత్రి తీసిన ఈ సినిమా ఇటు విమర్శకులను, అటు ప్రేక్షకులను మెప్పించింది. సినిమా కమర్షియల్‌గానూ చాలా పెద్ద హిట్టయింది.

దీని స్క్రీన్ ప్లే గురించి ఫిలిం ఇన్‌స్టిట్యూట్లలో పాఠాలు చెబుతున్నారంటే దీని ప్రత్యేకత ఏంటో అర్థం చేసుకోవచ్చు. వివిధ భాషల్లో ఈ చిత్ర రీమేక్ గురించి చాలా కాలంగా చర్చ నడుస్తోంది. తెలుగు రీమేక్ సంగతి ఎటూ తేలలేదు. హిందీలో మాత్రం ‘విక్రమ్ వేద’ రీమేక్ త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలున్నట్లు సమాచారం. చాన్నాళ్లుగా సాగుతున్న నటీనటుల వేటకు దాదాపుగా తెరపడినట్లు సమాచారం.

తమిళంలో విజయ్ సేతుపతి చేసిన వేద పాత్రలో ఆమిర్ ఖాన్.. మాధవన్ చేసిన క్యారెక్టర్‌లో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నట్లు సమాచారం. ముందు సేతుపతి పాత్రకు షారుఖ్ ఖాన్.. మాధవన్ పాత్రలో మాధవనే చేస్తారని వార్తలొచ్చాయి. ఐతే ఇప్పుడు కాస్టింగ్ మారిందట. మాతృకను డైరెక్ట్ చేసిన భార్యాభర్తల దర్శక ద్వయం పుష్కర్-గాయత్రినే హిందీ వెర్షన్‌కు కూడా దర్శకత్వం వహించనున్నారట.

ఎ వెడ్నస్ డే, బేబీ, స్పెషల్ చబ్బీస్ లాంటి సినిమాలు తీసిన దర్శకుడు నీరజ్ పాండే ‘విక్రమ్ వేద’ రీమేక్‌ను నిర్మించబోతున్నట్లు సమాచారం. హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు నేటివిటీ, స్క్రీన్ ప్లేలో కొన్ని మార్పులు చేస్తున్నారట. ప్రస్తుతం హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ రీమేక్‌లో నటిస్తున్న ఆమిర్.. అది పూర్తయ్యాక ఈ చిత్రంలోకి వస్తాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English