సుకుమార్ ఫ్రెండు మళ్లీ వస్తున్నాడు

సుకుమార్ ఫ్రెండు మళ్లీ వస్తున్నాడు

తన సినిమాలకు అసిస్టెంట్లుగా పని చేసి తన ఎదుగుదలకు తోడ్పడిన శిష్యులందరికీ కెరీర్ ఇవ్వాలని తపిస్తుంటాడు సుకుమార్. ఈ క్రమంలోనే కొందరు శిష్యులతో తనే సినిమాలు కూడా నిర్మించాడు. సుక్కు ఇలా అవకాశం ఇచ్చిన వాళ్లలో అతడి మిత్రుడు హరిప్రసాద్ జక్కా ఒకడు.

సుక్కులాగే అతను కూడా పూర్వాశ్రమంలో లెక్చరర్. సుక్కు స్ఫూర్తితో అధ్యాపక వృత్తిని విడిచిపెట్టి సినిమాల్లోకి వచ్చాడు. ‘100 పర్సంట్ లవ్’, ‘1 నేనొక్కడినే’ సినిమాలకు స్క్రిప్టు విభాగంలో పని చేశాడు. అతడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘దర్శకుడు’ అనే సినిమా కూడా నిర్మించాడు సుక్కు. కానీ ఆ చిత్రం ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దీంతో మళ్లీ హరిప్రసాద్ పేరు వినిపించలేదు.

ఐతే ఇప్పుడు తన మిత్రుడి అండ లేకుండా కొత్తగా ఒక సినిమా దక్కించుకున్నాడు హరిప్రసాద్. ఆ చిత్రం పేరు.. ప్లే బ్యాక్. ఇదొక వెరైటీ కాన్సెప్టుతో తెరకెక్కుతున్న సినిమా. 1993 రోజుల్లో ఒక అమ్మాయి ఫోన్ చేస్తే 2019లో ఒక అబ్బాయికి కాల్ వెళ్తే ఎలా ఉంటుందనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుందట. సినిమా టైటిల్ పోస్టర్‌ కూడా ఆసక్తికరంగా అనిపిస్తోంది. వినడానికి ఈ ఐడియా చాలా ఎగ్జైటింగ్‌గానే అనిపిస్తోంది. దీన్ని సినిమాగా ఎలా తీసి మెప్పిస్తారో చూడాలి.

‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్, ‘మల్లేశం’ ఫేమ్ అనన్య ఇందులో జంటగా నటిస్తున్నారు. ఈ నెలలోనే షూటింగ్ మొదలుపెట్టి సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ బేనర్ మీద పి.ఎన్.కె ప్రసాద్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మరి సుక్కు ఫ్రెండు ఈ సినిమాతో ఏమేరకు మెప్పిస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English