చరణ్‌ గురించి అదంతా హంబక్‌

చరణ్‌ గురించి అదంతా హంబక్‌

రామ్‌ చరణ్‌ డేట్స్‌ సంపాదించడానికి నిర్మాత బండ్ల గణేష్‌ పెను సాహసం చేశాడని, అతనికి పదిహేడు కోట్ల రూపాయల ఆఫర్‌ ఇచ్చి డేట్స్‌ సంపాదించుకున్నాడని మీడియాలో ఒక వర్గం ప్రచారం చేస్తోంది. అయితే ఈ వదంతుల్లో నిజం కాస్తయినా లేదు. ప్రస్తుతం తెలుగు సినిమాకి హయ్యస్ట్‌ పెయిడ్‌ యాక్టర్‌ మహేష్‌బాబు. ఇంతవరకు అతనికే పదిహేను కోట్లు కూడా ఎవరూ చెల్లించలేదు. పవన్‌, ఎన్టీఆర్‌ కూడా భారీగా తీసుకుంటారు. వీరితో పోలిస్తే చరణ్‌ ఇంకా వెనుకే ఉన్నాడు. చరణ్‌కి ఇప్పుడు బ్లాక్‌ అండ్‌ వైట్‌ కలిపి పది కోట్ల పారితోషికం దక్కుతోంది.

 'జంజీర్‌' చిత్రానికి అంతకంటే తక్కువే తీసుకున్నాడు. బండ్ల గణేష్‌ మిగతా నిర్మాతలకి ఛాన్స్‌ ఇవ్వకుండా హీరోలని ఎగరేసుకుపోవాలని చూస్తాడు కాబట్టి తన సినిమాకి మహా అయితే మరో కోటీ లేదా రెండు కోట్లు మాత్రం ఇస్తాడు. పదిహేడు కోట్లు ఇవ్వడమనేది పూర్తిగా హంబక్‌. ఏదో సినిమా గురించి హైప్‌ చేయడానికో లేదా చరణ్‌ ఆశబోతు అని చూపించడానికో ఇలాంటివి ప్రచారం చేస్తుంటారు. చరణ్‌తో ఇప్పుడు ముప్పయ్‌ అయిదు కోట్ల రూపాయలతో సినిమా తీసినట్టయితే నిర్మాత సేఫ్‌లో ఉండొచ్చు. సినిమా కథ మరీ బాగుంటే మరో అయిదు కోట్లు ఎక్కువ పెట్టవచ్చు. అలాంటిది చరణ్‌కే పదిహేడు కోట్లు ఇచ్చేస్తే ఇక సినిమా ఎంతలో తీస్తారు? సో... గ్యాప్‌ ఫిల్లింగ్‌ కోసం రాసుకునే ఈ గ్యాస్‌ న్యూస్‌ని నమ్మక్కర్లేదు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు