అంత తొందరేంటి అల్లు అర్జునా!

అంత తొందరేంటి అల్లు అర్జునా!

అల్లు అర్జున్‌ కొత్త సినిమా ఈమధ్యే సెట్టెక్కింది. ఏడాదికి పైగా విరామం తీసుకున్న అల్లు అర్జున్‌ ఇటీవలే త్రివిక్రమ్‌ సినిమా మొదలు పెట్టి వచ్చే సంక్రాంతికి అది విడుదల కావాలని డెడ్‌లైన్‌ కూడా పెట్టాడు. అయితే తన తదుపరి చిత్రానికి కథ త్వరగా సిద్ధం చేయించే పనిలో భాగంగా ముగ్గురు దర్శకులని లైన్‌లో పెట్టాడు. సుకుమార్‌, వేణు శ్రీరామ్‌, బోయపాటి శ్రీను ముగ్గురూ కూడా బన్నీ తర్వాతి సినిమా మాదంటే మాది అనేస్తున్నారు. అయితే అందరి కంటే ముందుగా లైన్‌లో వచ్చి నిలబడ్డ సుకుమార్‌ ఇప్పుడు బన్నీపై ఒత్తిడి తెస్తున్నాడు.

కథ రెడీ చేసేసుకుని షూటింగ్‌ మొదలు పెట్టాలని కోరుతున్నాడు. సెప్టెంబర్‌ నుంచే షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుందని కూడా మీడియాకి లీక్‌లు అందజేసారు. అయితే సుకుమార్‌ సినిమా రెగ్యులర్‌ కమర్షియల్‌ టైప్‌ కాదు. అందుకోసం బన్నీ ఒక గెటప్‌ వేసుకోవాలి. కనుక త్రివిక్రమ్‌ సినిమాతో ప్యారలల్‌గా చేసే వీల్లేదు.

అయినా సంక్రాంతికి రిలీజ్‌ పెట్టుకున్న సినిమాని పక్కనపెట్టి సుకుమార్‌ చిత్రాన్ని అల్లు అర్జున్‌ ముందుగా స్టార్ట్‌ చేస్తాడనేది నమ్మశక్యంగా లేదు. ఎలా చూసినా ఇది పీఆర్‌ స్టంట్‌ మాత్రమేనంటున్నారు. త్రివిక్రమ్‌ సినిమా పూర్తయిన తర్వాత డిసెంబర్‌ లేదా జనవరి నుంచి సుకుమార్‌ సినిమా షూటింగ్‌ జరగవచ్చునంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English