చిత్తూరు, కడపోళ్ల మీద పడ్డ సుకుమార్

చిత్తూరు, కడపోళ్ల మీద పడ్డ సుకుమార్

సుకుమార్ ఏ సినిమా తీసినా, ఎలాంటి కథను ఎంచుకున్నా.. నేటివిటీ, అథెంటిసిటీ మీద బాగా ఫోకస్ చేస్తాడు. నేపథ్యానికి తగ్గట్లుగా సెటప్ అంతా వాస్తవికంగా ఉండేలా చూసుకుంటాడు. ‘రంగస్థలం’ సినిమానే తీసుకుంటే 80ల్లో ఒక గోదావరి పల్లెటూరు ఎలా ఉంటుందో.. అక్కడి మనుషులు ఎలా ఉంటారో కళ్లకు కట్టినట్లు చూపించాడు. హైదరాబాద్ శివార్లలో షూటింగ్ చేసినా.. గోదావరి పల్లెటూరిలో ఉన్న భావనే కలిగించాడంటే.. సెట్టింగ్స్, మనుషుల ఆహార్యం, భాష, యాస విషయంలో తీసుకున్న శ్రద్ధే కారణం. ఇప్పుడు అల్లు అర్జున్ కథానాయకుడిగా తీయబోయే సినిమా విషయంలోనూ అంతే శ్రద్ధ పెడుతున్నాాడట సుక్కు. ఈసారి ఆయన సెటప్ రాయలసీమకు మారుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ తిరిగే కథతో ఆయన సినిమా తీయబోతున్నాడు.

ఇందుకోసం ఎర్రచందనం అడవులు విస్తరించిన చిత్తూరు, కడప జిల్లాల్ని జల్లెడ పట్టేశారాయన. తన టీంతో కలిసి రెండుమూడుసార్లు ఈ రెండు జిల్లాల పర్యటనకు వెళ్లారు. అడవుల్లో పోలీసులతో కలిసి కూంబింగ్‌కు కూడా వెళ్లారు. లొకేషన్ల ఎంపిక పూర్తయింది. స్క్రిప్టు కూడా ఎప్పుడో లాక్ అయింది. ప్రస్తుతం డైలాగ్ వెర్షన్ మీద దృష్టిపెట్టాడట సుకుమార్. ముందు మామూలుగా డైలాగులు రాసేసి... వాటిని కడప, చిత్తూరు జిల్లా వాసుల యాక్సెంట్‌లో రాయించే ప్రయత్నం జరుగుతోంది. ప్రతి డైలాగ్‌లోనూ నేటివిటీ, సహజత్వం ఉండేలా డైలాగుల్ని సీమ స్టయిల్లోకి తర్జుమా చేయించనున్నాడట సుక్కు. ఈ విషయంలో సుక్కు ఏమాత్రం రాజీపడట్లేదని.. ఒక సీమ వ్యక్తి సినిమా తీసినట్లు ఉండేలా ఔట్ పుట్ తీసుకురావాలని ఆయన ప్రయత్నిస్తున్నాడని చిత్ర వర్గాల సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English