బిగ్ బాస్ 1 విజేత మాదిరే బిగ్ బాస్ 3 విజేత?

బిగ్ బాస్ 1 విజేత మాదిరే బిగ్ బాస్ 3 విజేత?

స్టార్ హీరోల అభిమానుల్లో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ లెక్క వేరుగా చెబుతుంటారు. తమ హీరో మీద వారి అభిమానం వ్యక్తిగత స్థాయి వరకూ ఉంటుంది. పవన్ అభిమానులు ఇష్యూ దేనినైనా పర్సనల్ గా తీసుకుంటారన్న మాట వినిపిస్తూ ఉంటుంది.  అందుకే.. సినిమాల్లో కానీ.. టీవీల్లో కానీ తాము పవన్ అభిమానులమని చెప్పుకనే వారు బోలెడంత మంది కనిపిస్తారు.

ఒక సెలబ్రిటీ తాను పవన్ ఫ్యాన్ అని చెప్పటం ద్వారా.. ఆయన్ను అభిమానించే కోట్లాది మందికి సదరు సెలబ్రిటీ మీద సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. తాజాగా ఈ ధోరణే బిగ్ బాస్ 3 విజేతను డిసైడ్ చేయనుందా? అన్నది ఆసక్తికర చర్చగా మారింది. బిగ్ బాస్ 1 విజేతగా శివబాలాజీ నిలవటం తెలిసిందే. ఆయన పవన్ కు వీరాభిమాని. ఆ విషయాన్ని ఆయన ఓపెన్ గా చెప్పేసేవారు. ఆయన్ను గెలిపించేందుకు పవన్ ఫ్యాన్స్ ప్రిస్టేజ్ గా తీసుకొని తమ హీరో అభిమానిని షో లో గెలిపించటం తమ కర్తవ్యమన్నట్లుగా భావించారు. చివరకు అనుకున్నది సాధించారు.

ఇక.. తాజాగా నడుస్తున్న సీజన్ 3 విషయానికి వస్తే.. బిగ్ బాస్ హౌస్ మేట్స్ లో పవన్ వీరాభిమానిగా అషురెడ్డిని చెబుతారు. సమంత పోలికలతో జూనియర్ సామ్ అని పిలుచుకునే ఆమె.. పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. సోషల్ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగ్ తో బిగ్ బాస్ షోలో అవకాశాన్ని ఇచ్చారు. పవన్ కల్యాన్ తో కత్తి మహేశ్ వివాదం జరిగినప్పుడు అన్షు రెడ్డి తన ఎదపైన పవన్ టాటూ వేయించుకొని.. ఆ ఫోటోను పోస్ట్ చేస్తూ.. తాను తన ఎద మీద పీకే పేరుతో టాటూ వేయించుకున్నాను కాబట్టి.. ఆయనతో తనకు ఎఫైర్ ఉన్నట్లా?  అని ప్రశ్నించింది. అప్పట్లో అషు చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

పవన్ కు అంత వీరాభిమాని అయిన అన్షూ హౌస్ లో ఉన్నప్పుడు ఆమెను విజేతగా నిలిపేందుకు పీకే ఫ్యాన్స్ ఇప్పటికే రంగంలోకి దిగారని చెబుతున్నారు. సెటిల్డ్ గా గేమ్ ఆడుతున్న అషు రెడ్డికి హౌస్ బయట పెద్ద బలగమే అండగా ఉన్న నేపథ్యంలో బిగ్ బాస్ 1 సీజన్ లో ఎలా అయితే పవన్ అభిమాని విజేతగా నిలిచారో బిగ్ బాస్ 3లో కూడా అదే సీన్ రిపీట్ అవుతుందా? అన్నది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English