గీతా ఆర్ట్స్‌లో సినిమా.. కామెడీకేనట

గీతా ఆర్ట్స్‌లో సినిమా.. కామెడీకేనట

కొన్ని రోజుల కిందట ‘గుణ 369’ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌తో స్టేజ్ మీద చిన్న తమాషా చేశాడు యువ కథానాయకుడు కార్తికేయ. ‘సరైనోడు’ తర్వాత గీతా ఆర్ట్స్‌లో బోయపాటితో మరో సినిమా ఉంటుందని ఆయన అంటుంటే.. మధ్యలో జోక్యం చేసుకుని హీరో నేనేనా అని అడిగాడు కార్తికేయ. వెంటనే అరవింద్ తడుముకోకుండా ‘వెల్కం టు గీతా ఆర్ట్స్’ అనేశాడు.

దీంతో కార్తికేయతో గీతా సంస్థలో నిజంగా సినిమా ఉంటుందేమో అన్న గుసగుసలు వినిపించాయి. ఇదే విషయమై ‘గుణ 369’ ప్రమోషన్ల సందర్భంగా కార్తికేయను అడిగితే.. దండం పెట్టేశాడు. ఆ రోజు జరిగింది అంత సీరియస్‌గా తీసుకోవద్దని మీడియాను కోరాడు.

‘‘నేను ఆ రోజు అరవింద్ గారితో సరదాగా మాట్లాడాను. గీతా ఆర్ట్స్ లో మాకు ఛాన్స్ ఉంటుందా అని అడిగితే.. ఆ మాటకి అయన కూడా సరదాగా ‘వెల్కమ్ టు గీతా ఆర్ట్స్’ అన్నారు. అంతకుమించి.. సినిమా ప్లానింగ్ అయితే ఏమీ లేదు. ఉంటే బాగుండన్నది నా ఆశ’’ అని కార్తికేయ చెప్పాడు.

మరోవైపు తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి కార్తికేయ చెబుతూ..‘‘శేఖర్‌ విఖ్యాత్‌ అనే కొత్త డైరెక్టర్‌‌తో నేను చేస్తున్న సినిమా షూటింగ్‌ దశలో ఉంది. ఆ సినిమాను నా సొంత బ్యానర్‌ లోనే చేస్తున్నాను. ఈ ఏడాదిలోనే రిలీజ్‌ ఉంటుంది. ఈ మధ్యే ఇంకో కథ ఫైనల్‌ చేశాను. వినాయక్‌ గారి దగ్గర పని చేసిన శ్రీ అనే మరో కొత్త దర్శకుడు మంచి కథ చెప్పాడు. దాని గురించి త్వరలోనే ప్రకటన ఉంటుంది’’ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English