బన్నీ.. ఈ బల ప్రదర్శనేంటి?

బన్నీ.. ఈ బల ప్రదర్శనేంటి?

అల్లు అర్జున్‌ను కొన్నేళ్లుగా గమనిస్తుంటే.. సెల్ఫ్ ప్రొజెక్షన్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు మెగా గొడుగు కింద ఉన్న అతను.. తర్వాత తర్వాత సొంత ఇమేజ్ బిల్డ్ చేసుకోవడానికి, మెగా అభిమానులందు తన అభిమానులు వేరని చాటుకోవడానికి గట్టిగా ప్రయత్నించాడు. పవన్ కళ్యాణ్ అభిమానులతో సున్నం పెట్టుకున్నాక ఈ విభజన మరింత స్పష్టంగా కనిపించింది.

తన కోసం ఒక పీఆర్వో వర్గాన్ని, అభిమాన సంఘాల నాయకుల్ని సెట్ చేసుకుని.. వాళ్ల ద్వారా ఆన్ లైన్, ఆఫ్ లైన్ హైప్ కోసం ఒక ప్రణాళిక ప్రకారం అడుగులు వేయడం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తన కొత్త సినిమా చిత్రీకరణ కోసం కాకినాడ వెళ్లాడు బన్నీ.

ఐతే వెళ్లినవాడు సైలెంటుగా షూటింగ్ చేసుకుని వచ్చేయొచ్చు కదా? అలా చేయలేదు. బల ప్రదర్శనకు దిగాడు. కాకినాడ సిటీలో ఎక్కడ చూసినా బన్నీ ఫ్లెక్సీలు, బేనర్లే. ఈ సందర్భంగా కార్ల ర్యాలీ, బైకుల ర్యాలీ, పూల వర్షాలు.. అబ్బో చాలా హంగామానే నడిచింది. ఇదంతా అప్పటికప్పుడు యాదృచ్ఛికంగా ఏమీ జరిగినట్లు లేదు.

బైకులకు, కార్లకు ప్రత్యేక అలంకరణలు, జెండాలు, అల్లు బాయ్స్ అనే స్టిక్కర్లు.. ఈ హంగామా అంతా చూస్తే ఇదంతా ప్రి ప్లాన్డ్‌గా జరిగినట్లే కనిపిస్తోంది. బన్నీ కారు వెంటనే వేలమంది ర్యాలీ చేయడం.. ట్రాఫిక్ జాం కావడం.. బన్నీ కార్లోంచి బయటికొచ్చి అభివాదాలు చేయడం.. అంతా కూడా ఒక రాజకీయ నాయకుడి బల ప్రదర్శన తరహాలో కనిపించింది. బన్నీ మరీ ఇంతగా సెల్ఫ్ ప్రమోషన్ మీద ఎందుకు దృష్టిపెడుతున్నట్లో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English