కొడుకు సినిమాను జక్కన్న రీషూట్ చేయించాడా?

కొడుకు సినిమాను జక్కన్న రీషూట్ చేయించాడా?

తన స్వీయ దర్శకత్వంలో లిటిల్ సోల్జర్స్’ లాంటి అద్భుతమైన సినిమా తీయడమే కాదు.. ‘అమృతం’ లాంటి సూపర్ సీరియల్.. ‘అనుకోకుండా ఒక రోజు’ లాంటి అదిరిపోయే థ్రిల్లర్ తీసి సత్తా చాటిన ప్రతిభాశాలి గుణ్ణం గంగరాజు. ఆయన తనయుడు అశ్విన్ గంగరాజును దర్శకుడిగా పరిచయం చేస్తూ రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మిస్తున్న సినిమా ‘ఆకాశవాణి’.

 రాజమౌళి ఫ్యామిలీ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. గంగరాజు, రాజమౌళి, కీరవాణి.. ఇలా కుటుంబ పెద్దలందరూ ఈ చిత్రాన్ని పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఐతే ఈ సినిమా షూటింగ్ అంతా అయ్యాక కీలకమైన సన్నివేశాల విషయంలో ఒక పొరబాటును గుర్తించి రీషూట్ చేయించాడట జక్కన్న.

‘ఆకాశవాణి’లో విలన్ పాత్ర అత్యంత కీలకమట. కథంతా దాని చుట్టూనే తిరుగుతుందట. ఐతే ఈ పాత్రకు ఒక కొత్త నటుడిని పెట్టుకున్నారట. అతను ఆ పాత్రను హోల్డ్ చేయలేకపోయాడట. స్టేచర్ ఉన్న నటుడు చేయాల్సిన పాత్ర కావడంతో అది పండదని రాజమౌళి అండ్ కో ఫీలైందట.

ఇంటెన్సిటీ దెబ్బ తింటుందని భావించి ఆ పాత్రను వేరే నటుడితో చేయించి మళ్లీ సన్నివేశాలన్నీ రీషూట్ చేయించినట్లుగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈపాటికి విడుదలకు సిద్ధంగా ఉండాల్సిన సినిమా.. అందుకే ఆలస్యమైందట. సెప్టెంబరులో ‘ఆకాశవాణి’ ప్రేక్షకుల ముందుకు రావచ్చని సమాచారం. ఈ చిత్రంలో లీడ్ రోల్స్‌లో కొత్తవాళ్లు చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English